సిగ్గు ఎలా ఉంటుందండీ...
సిగ్గంటే ఎలా ఉంటుందండీ... అని అడిగింది భార్య
నువ్వు పెళ్లిచూపుల సమయంలో పడ్డావు చూడు, అది అని చెప్పాడు భర్త
మరి వినయమంటే ఏమిటండీ... అడిగింది ఆ ముద్దుల భార్య
పెళ్లయిన కొత్తలో నువ్వు నా పట్ల చూపావు చూడు, అది అని బుద్ధిమంతుడిలా భర్త.
..... ..... ...
ఆమె ఎలా ఏడుస్తుందేమిటండీ.. అని అడిగాడు ఓ వ్యక్తి ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్న ఓ మహిళను చూసి పక్కాయనను.
టీవీ సీరియల్స్ చూస్తుంది లెండి... అందుకే మధ్య మధ్యలో బ్రేక్‌లు ఇస్తున్నట్లుగా.. రబ్బరు మాదిరిగా సాగుతున్నట్లుగా ఆమె ఏడుస్తోంది... చెప్పాడతను.












Click it and Unblock the Notifications