ఈ రాశులకు గట్టిగా పట్టుకుంటున్న అదృష్టం

జ్యోతిష్యం ప్రకారం జులై నెల మూడోవారంలో ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతుండటంతోపాటు సూర్యుడు కూడా సంచారం చేస్తున్నాడు. శుక్రుడితో మరో గ్రహం కూడా కలవనుండటంతో ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా శుక్రాదిత్య రాజయోగం వల్ల పలు రాశులవారికి ఆర్థికంగా కలిసిరానుందని, జీవితంలో వారికి ఆనందం, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయని చెబుతున్నారు. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. పెట్టుబడులు పెట్టడంవల్ల ఆర్థికంగా లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. డబ్బులకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

2024 july month 3rd week 15th to 21st luckiest zodiac signs details

మిథునరాశి
అనుకున్న పనులు సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంది. ఉద్యోగాలు చేసేచోట తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభించి పని ఒత్తిడి నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఆర్థికంగా లాభపడటంతోపాటు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజయవంతమవుతారు.

మకర రాశి
స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. శుభవార్తలను వినడంతోపాటు ఈ వారం మొదటిరోజులో శుభవార్తను వింటారు. కుటుంబానికి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని దుష్ప్రభావాలున్నాయి.

సింహ రాశి
అదృష్టం సహకరించడంవల్ల అనుకున్న పనులు పూర్తిచేయడంతోపాటు ఆస్తులను కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులను చాలా సులువుగా పూర్తిచేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభ్యమవడంతోపాటు ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలను సలువుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+