Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరిదేవి అవతారం - పరమాన్నం నివేదన

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరిదేవి అవతారం. అమ్మవారికి నివేధనగా పరమాన్నం నివేధిస్తారు.

9th day of Navratri: Goddess Durga in Rajarajeshwari devi avatar,what is the prasadam to be offered

పరమాన్నం చేయడానికి కావలసినవి పదార్ధాలు :-

చిక్కటి పాలు 6 కప్పు

1 టిన్ మిల్క్ మేడ్

బియ్యం 1 కప్పు

పంచదార ఒకటిన్నర కప్పు

ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్పు

ఏలకలు పౌడర్ 1/2 స్పూన్

నెయ్యి 5 టేబల్ స్పూన్స్

పరమాన్నం చేసే విధానం :-

ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి తరువాత పాలు, ఏలక పౌడర్, వేసి కుక్కర్లో 2 విజిల్ వచ్చెంత వరకు ఉంచండి, అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై ఉంచి అందులో కాస్త నెయ్యి వేసి ఎండు ద్రాక్షా, జీడిపప్పు దోరగా వేయించి ఉంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి ఉడికిన అన్నానికి చెక్కర వేసి ఒక్క 5 నిముషాలు మళ్ళీ ఉడికించి
( అలా ఉడికినప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి ) అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడి వేడిగా శ్రీ రాజరాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి.

* ప్రధాన దేవతను సర్వాభరణములతో అలంకారం. పదవ రోజు ఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా పెట్టాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+