వాస్తు ప్రకారం ఈ ఒక్క విగ్రహం ఇంట్లో ఉంటే మీకు తిరుగులేదు!
ఇంటికి వాస్తు ముఖ్యం. వాస్తు ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని అందరి నమ్మకం. వాస్తు బాగుంటే అన్నిరకాలుగా కలిసివస్తుందని నిపుణులు కూడా చెబుతుంటారు. వీరు చెబుతున్నదాని ప్రకారం ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టించడంవల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ కుటుంబంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని, వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని తెలియజేస్తున్నారు. సూర్య భగవానుడి విగ్రహాన్ని ఉంచడంవల్ల కలిగే లాభాలేంటనే విషయం తెలుసుకుందాం.
ఏ రకమైన సూర్యుడి విగ్రహం శుభం కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సూర్యభగవానుడి విగ్రహాలను వివిధ లోహాలతో తయారు చేస్తారు. వాటి వివరాలను పరిశీలిస్తే..

రాగి విగ్రహం
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. జీవితం మెరుగుపడుతుంది. మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఈ విగ్రహం వల్ల ఉపశమనం పొందుతారు.
వెండి విగ్రహం
మనిషికి ఈ విగ్రహం ఆధిపత్యాన్నిస్తుంది. చేసే పనిలో విజయాన్ని తెస్తుంది.
బంగారు విగ్రహం
ఇంట్లో సంపదను పెంచుతుంది. ఇప్పటివరకు ఏమైనా రుణాలంటే అవి కూడా ఈ విగ్రహం వల్ల తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారు.
చెక్క విగ్రహం
ఇంట్లో సూర్యుడి చెక్క విగ్రహం ఉండటంవల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. జీవితంలో పురోగతి ఉంటుంది.
రాతి లేదా మట్టి విగ్రహం
ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విగ్రహాలు కుటుంబానికి అత్యంత శ్రేయస్సును కలిగిస్తాయి. అంతా శుభప్రదంగా ఉండేలా చూస్తాయి.
ఏ దిశలో, ఎప్పుడు ప్రతిష్టించాలంటే..
సూర్య భగవానుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం చాలా ఉత్తమం, మంచిది. సూర్యుడికి ఈ దిక్కు ఎంతో అనుకూలం. కుటుంబానికి శ్రేయస్సును తెస్తుంది.
అర్ధరాత్రి 12.00 గంటల నుంచి తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో ప్రతిష్టిస్తే మంచిది. ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో సూర్యుడు భూమికి ఉత్తరం వైపున ఉంటాడు. పిల్లలు సరిగా చదవకపోతుంటే తెల్లవారుజామున 3.00 గంటల నుంచి 6.00 గంటల మధ్యలో ప్రతిష్టించాలి. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది.












Click it and Unblock the Notifications