వాస్తు ప్రకారం రాత్రివేళ ఈ వస్తువులను ఓపెన్‌గా ఉంచకూడదు!
వాస్తు ప్రకారం ఇంట్లో రాత్రి సమయంలో నిద్రించే ముందు చాలామంది కొన్ని వస్తువులను నిర్లక్ష్యంగా వదిలేస్తుంటారు. బహిరంగంగా ఉంచుతుంటారు. దీనివల్ల ఇంట్లో పేదరికం ప్రవేశిస్తుంది. అందుకే రాత్రివేళ కొన్ని వస్తువులపై మూతలు ఉండాలి. మరికొన్ని వస్తువులు జాగ్రత్తగా ఉండే ప్రదేశంలో ఉండాలి. ఇలా చేయడంవల్ల వాస్తు ప్రకారం ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సంపదను పెంచుతుంది. వ్యతిరేక శక్తులను పారద్రోలుతుంది. ప్రతి ఒక్కరు వీటిని అనుసరించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట నిద్రించే ముందు నీళ్లు లీకవకుండా చూసుకోవాలి.
పంపులన్నీ కట్టేసుకోవాలి.
బకెట్ లో నీళ్లు ఉండకూడదు.
నీళ్లు బకెట్ లో ఓపెన్ గా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉండదు.

షింక్ లో తిన్న ప్లేట్లు అలా వదిలేయకూడదు.
దీనివల్ల ధన ప్రవాహం దెబ్బతింటుంది.
ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
రాత్రివేళ ఆ పాత్రలన్నీ శుభ్రం చేయాలి.
చెత్త కూడా రాత్రివేళ ఇంట్లో ఉండకూడదు.
పాలు, బియ్యం, గోధుమలు ఓపెన్ గా రాత్రిపూట ఉండకూడదు.
గింజలు, పాలు వంటివాటిపై మూత పెట్టాలి.
ఇలా చేయకపోతే వ్యతిరేక శక్తి పెరుగుతుంది.
చీపురు అంటే లక్ష్మీదేవికి చిహ్నం.
చీపురును ఓపెన్ గా ఉంచొద్దు.
ఇతరులకు కనిపించకుండా రాత్రిపూట పెట్టాలి.
నేలపైనే పడుకోబెట్టాలికానీ నిలబెట్టకూడదు.
నిలబెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
పర్సు, బీరువా తాళాలు, పర్సులాంటివి నిర్లక్ష్యంగా బయట పెడుతుంటారు.
ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు తప్పవు
వీటిని చాలా జాగ్రత్తగా ఉండే స్థానంలో పెట్టాలి.
సంపద పెరిగినా డబ్బు చేతిలో నిలవదు.
ఇంట్లో సువాసన వెదజల్లే ధూపం వేయాలి.
నిద్రించే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి.
దీనివల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
మంచి నిద్ర పడుతుంది.












Click it and Unblock the Notifications