వాస్తు ప్రకారం పేదరికం పోవాలంటే ఈ వస్తువులతోపాటు వాస్తు శక్తిని ఇలా సమతుల్యంగా ఉంచండి
ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి లేకుండా ఎవరూ ఉండరు. అంబానీ నుంచి సుబ్బారావు వరకు డబ్బులు అవసరంపడుతూనే ఉంటాయి. కొంతమంది మాత్రం తమంతట తాముగా పేదరికంలో కూరుకుపోతుంటారు. బద్ధకం, నిర్లక్ష్యం, పనిని వాయిదా వేయడంలాంటివి చేయడంవల్లే ఇలా దిగజారిపోతుంటారు. కొందరు ఎంత కష్టపడినా డబ్బును సంపాదించలేకపోతుంటారు.
తమ తలరాత ఇలాగే ఉందని సరిపెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రాన్ని నమ్ముకొని మనం ఉండే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకుంటే సంపద నిలబడుతుందని, పేదరికం ఉండదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మార్పులు చేసుకోవడంవల్ల ఇంట్లో నుంచి ప్రతికూల శక్తులు పారిపోతాయి. సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

ఇంట్లో కచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ఫొటో ఉండాలి.
ప్రతిరోజు లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగిస్తే ఆర్థికంగా బాగుంటుంది.
శ్రేయస్సు కలగడంతోపాటు సంపద పెరుగుతుంది.
కుబేరుడు కూడా సంపదకు అధిపతి.
ఆయన్ను పరమేశ్వరుడు సంపదకు అధిపతిగా చేశాడు.
ఉత్తర దిక్కున ఈయనే ఉంటాడు.
ఈశాన్య దిక్కులో ఇంట్లో కుబేరుడి విగ్రహాన్ని ఉంచితే ధనప్రవాహం ఉంటుంది.
సంపద స్థిరత్వానికి, బలానికి, అదృష్టానికి ఏనుగు ప్రతీక.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద చిన్న ఏనుగు విగ్రహం ఉంచాలి.
దీనివల్ల సానుకూల శక్తి లోపలికి ప్రవేశిస్తుంది.
పూజలో శంఖం చాలా పవిత్రమైంది.
ఇంట్లో శంఖాన్ని ఊదితే దుష్టశక్తులన్నీ పారిపోతాయి.
ఉదయం, సాయంత్రం రెండుపూటలా ఊదితే చెడు శక్తులనేవే ఇంట్లోకి రావు.
కుటుంబంలో శాంతి, ప్రేమ ఉండాలంటే జంటగా ఉండే చేపలు ఉండాలి.
అక్వేరియం, చేపల తొట్టి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.
నీటి శబ్దం వస్తుండటంవల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.
తులసి లాంటి పవిత్ర మొక్కను పెంచాలి.
గాలిని శుభ్ర పరిచి వాతావరణం ప్రశాంతంగా ఉంచుతుంది.
మనీప్లాంట్ కూడా వాస్తు ప్రకారం మంచిదే.
అయితే ముళ్ల మొక్కలు పెంచకూడదు.
స్ఫటికాలు చెడు శక్తులను ఇంట్లోకి ప్రవేశించనివ్వు.
వాస్తు నిపుణల సలహా తీసుకొని స్ఫటికాలను ఇంట్లో ఉంచాలి.
ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
పాత బట్టలు వేసుకోవద్దు.
పాత వస్తువులు ఉంచొద్దు.
ఇంటికి తగినంత గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.












Click it and Unblock the Notifications