దసరా తర్వాత జంటగా వీరికి సంపదల వరమిచ్చిన గురుశుక్రులు!
జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. బృహస్పతితో పాటు శుక్ర గ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఇక అక్టోబర్ నెలలో బృహస్పతి శుక్ర గ్రహాలు కలిపి మ్యాజిక్ చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు దసరా పండుగ తర్వాత సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్ట లక్ష్మి వరిస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
సంసప్తక రాజయోగం
బృహస్పతి శుక్రుడు ఒకదానికొకటి ఏడు ఇళ్ల దూరంలో ఉన్నప్పుడు సంసప్తక రాజయోగం ఏర్పడుతుందని చెబుతారు. ఈ రాజయోగం కొంతమంది జీవితాలలో అదృష్టాన్ని కలిగిస్తుంది. గురు శుక్ర గ్రహాల అరుదైన కలయిక కారణంగా ఏర్పడే ఈ యోగంతో లాభపడే ఆ రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
సంసప్తక రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారు శుభవార్తలను వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయం వృషభ రాశి వారికి కలిసి వచ్చే సమయం. వృషభ రాశి వారికి ఈ సమయంలో అన్నీ విజయాలే వస్తాయి.
ధనుస్సు రాశి
దసరా తర్వాత ఏర్పడే సంసప్తక రాజయోగం ధనస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఉద్యోగాలు చేసేవారు మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. ఇది ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం. ఊహించని ధనలాబాలతో ధనుస్సు రాశి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి
సంసప్తక రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇది వృశ్చిక రాశి వారికి నిజంగా అదృష్ట సమయం .ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications