మహా శివరాత్రి నుండి ఈ రాశులవారికి అఖండ రాజయోగం!
హిందూ ధర్మ శాస్త్రంలో మహా శివరాత్రి రోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వల్ల కలిగే పరిణామాలు, అలాగే కొన్ని ప్రత్యేక దినాలలో గ్రహాల సంయోగం వల్ల జరిగే పరిణామాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మహా శివరాత్రి రోజున ఒక అద్భుతమైన ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది.
మహా శివరాత్రి... ప్రత్యేక రాజయోగం
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం .అటువంటి మహాశివరాత్రి రోజు గ్రహాల సంచారం, సంయోగం కారణంగా ఒక ప్రత్యేకమైన రాజయోగం ఏర్పడుతుంది. ఒక ఖగోళ దృగ్విషయం చోటు చేసుకోబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మహా శివరాత్రి రోజు మేష రాశి వారు అద్భుత యోగాన్ని చూడబోతున్నారు. వీరికి ఈ సమయంలో అన్ని విధాలా కలిసొస్తుంది. మేషరాశి జాతకుల వ్యాపారాలు విస్తరిస్తాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇది మేష రాశి వారికి నిజంగానే అదృష్ట సమయం. ఈ సమయంలో ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది.
వృషభరాశి
మహాశివరాత్రి నుంచి వృషభ రాశి వారికి కలిసొస్తుంది. వృషభ రాశి జాతకులు పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు ఇది శుభ సమయం. ఏదైనా ఆస్తులు
కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడమే కాకుండా ఈ సమయంలో సంతోషంగా, సుఖంగా జీవిస్తారు.
మీనరాశి
మీన రాశి వారికి కూడా మహాశివరాత్రి నుంచి బాగా కలిసొస్తుంది. మీనరాశి జాతకులు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం వీరు నూతన గృహాలను లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీన రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ఆర్దికంగా ఇప్పుడు బలోపేతం అవుతారు. ఇది మీనరాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications