అక్షయ తృతీయ రోజు ఇవి దానం చేసి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి

అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పసుపు, కుంకుమతో పూజించాలి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు డబ్బు వచ్చేమార్గాలు తేలికవుతాయి. అక్షయ తృతీయ రోజు సూర్యుడు, చంద్రుడు ఉన్నతమైన రాశుల్లో కూర్చున్నారు. ఆరోజు పేదవారికి అవసరమైన వస్తువులను దానం చేయడంవల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది.

అక్షయ తృతీయ రోజున నీటితో నింపిన కలశం దానం చేయాలి. కలశాన్ని దానం చేసే ముందు అందులో గంగాజలం కలపాలి. అప్పుడు కలశాన్ని పేదవారికి లేదంటే బ్రాహ్మణుడికి దానం చేయాలి. బ్రహ్మదేవుడి కుమారుడు అక్షయకుమార్ వైశాఖమాసం శుక్ల తృతీయనాడు జన్మించాడు. అప్పటి నుంచి అక్షయ తృతీయ అని పిలవడం ప్రారంభించారు. పెద్దలకు శ్రాద్ధం చేస్తే వారి ఆశీస్సులతోపాటు ఐశ్వర్యం లభిస్తుంది.

lakshmidevi

అక్షయ తృతీయ రోజు ఇచ్చే విరాళాలకు ప్రాధాన్యత ఉంది. కుంభం, పంచదార, సత్తు, ఫ్యాన్, గొడుగు, పండ్లు మొదలైన వాటిని దానం చేయడంవల్ల యాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆరోజు వెండి, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఒకవేళ ఆరోజు బంగారు వస్తువులు కొనలేకపోతే 11 లక్ష్మీ కౌరీలను తెచ్చి వాటిని పూజించాలి. వీటిని మనం డబ్బులు నిల్వచేసేచోట ఉంచాలి. దీనివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

ఏప్రిల్ 22న అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడానికి అనుకూలమైన సమయం ఉదయం 7:49 నుండి ప్రారంభమై..ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 5:48 వరకు ఉంటుంది. ఏ పనిచేపట్టినా మంచి ఫలితాలనిస్తుందని నమ్ముతారు. బంగారం, ఇల్లు, కారు, భూమి ఏది కొన్నా శుభప్రదమని భావిస్తారు. ఆరోజు బార్లీని కొనుగోలు చేయడం కూడా శుభంగా భావిస్తారు. వినియోగదారులను ఆకర్షించేందుకు పలు బంగారు దుకాణాలు ఆరోజు అనేక ఆఫర్లు ప్రకటిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+