50 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
శుక్రుడు మార్చి 31న మీన రాశిలో ప్రవేశించాడు. అప్పటికే అక్కడ రాహువు ఉన్నాడు. శుక్రుడు, రాహువు కలయికవల్ల మాలవ్య రాజయోగంతోపాటు విపరీత రాజయోగం ఏర్పడుతోంది. వీటి కలయిక ఈనెల 24వ తేదీ వరకు ఉంటుంది. విపరీత రాజయోగం అనేది 50 సంవత్సరాల తర్వాత ఏర్పడింది.
ఇది అద్భుతమైన యోగంగా జ్యోతిష్యులు పరిగణిస్తారు. మొత్తం ప్రభావం 12 రాశులపై ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. 50 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రాజయోగంవల్ల ఏ రాశులవారి సంపద పెరుగుతుందో చూద్దాం.

కర్కాటక రాశి
శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఉద్యోగం పొందుతారు. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది.
మిథున రాశి
పెట్టుబడి కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఆర్థికంగా లాభాలుంటాయి. జీవితం అంతా రొమాన్స్ తో నిండిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధన లాభం ఉంది. వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏ పని తలపెట్టినా వందశాతం విజయం సాధిస్తారు. చిన్నవయసులోనే పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
వృషభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. శృంగార జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళతారు. వృత్తిలో ఆర్థికంగా స్థిరపడతారు. అన్ని పనుల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తిచేయడానికి అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications