Astrology: నవంబర్ 3నుండి ఈ రాశులవారి అదృష్టం నక్కతోక తొక్కినట్టే; మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వివిధ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు వివిధ రాశుల్లోకి ప్రయాణం చేయడం వల్ల అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 3వ తేదీన శుక్రగ్రహం కన్యా రాశిలో ప్రవేశిస్తుంది. నవంబర్ మూడో తేదీ నుండి 30వ తేదీ వరకు శుక్ర గ్రహం కన్య రాశిలో నీచ స్థితికి చేరుతుంది.
శుక్ర గ్రహం లగ్జరీకి కారణమయ్యే గ్రహం అని చెబుతారు. సంతోషాలకు, శృంగారానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, కళలకు కారకుడైన శుక్రుడు నీచ స్థితికి చేరడం వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నప్పటికీ, జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చును. అయితే కన్యారాశి లోకి చేరిన శుక్రుడు కొన్ని రాశులకు మెరుగైన ప్రయోజనాలను కూడా చేకూరుస్తాడు.

కన్యా రాశిలోకి శుక్రుడి రవాణా మేషరాశి వారికి శుభాలను కలిగిస్తుంది. మేషరాశిలో శుక్రుడు 6 ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మేష రాశి వారి జీవితం శాంతి, సంతోషాలతో నిండిపోతుంది. చాలాకాలంగా నిలిచిపోయిన ధనం మళ్లీ వారి చేతికి వస్తుంది. శుక్రుని అనుగ్రహం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. పరిస్థితి మెరుగ్గా మారుతుంది. ఈ సమయంలో ఏ పని అనుకున్నా చక్కగా జరుగుతుంది.
శుక్ర సంచారం వృషభ రాశి వారికి కూడా లాభాలను చేకూరుస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో పురోభివృద్ధికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహం అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి అనుగ్రహంతో శ్రమకు తగ్గ ఫలితం పొంది వృషభ రాశి వారు సంతోషంగా జీవిస్తారు.
కన్యారాశిలో శుక్ర సంచారం తులా రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. తులా రాశి వారికి ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వారసత్వంగా ఆస్తులు వచ్చి, రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసుకునే వారికి ఇది ఆర్థిక పురోగతిని కలిగించే కాలం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. చిరకాల కోరికలు నెరవేరుతాయి. విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి కూడా ఇప్పుడు ఆస్కారం ఉంటుంది.
మిధున రాశి వారికి శుక్ర సంచారం లాభిస్తుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. కోర్టు కేసుల్లో తీర్పులు మిధున రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. పనిచేసేవారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications