కుంభరాశిలోకి సూర్యుడు.. రేపటి నుంచి ఈ రాశుల జాతకం మారుతోంది
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఈ నెలలో మకర రాశి నుంచి శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన ఈ పరిణామం సంభవించనుంది. ఇది చాలా శక్తివంతం అని, ఆ ప్రభావంతో కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారని చెబుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఉద్యోగస్థులు వారి వారి కార్యాలయాల్లో మంచి గుర్తింపును పొందుతారు. సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. పదోన్నతులతోపాటు వేతనాలు కూడా పెరుగుతాయి. మీడియా, రచన, విద్యకు సంబంధించిన రంగాల్లో పనిచేస్తున్నవారికి పనులు అనుకూలంగా అవుతాయి. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వాటిల్లో మంచివాటిని ఎంపిక చేసుకుంటే చాలా మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి విజయాలు చెంతనే ఉంటాయి.

మేషరాశి
ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. దీనివల్ల వారి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారికి అదనపు ఆదాయం కోసం కొత్త వనరులు దొరుకుతాయి. అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కొంతకాలం పనులవకుండా వేధిస్తున్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. సూర్యుడి సంచారం మేషరాశివారికి ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి
డిజైన్, ఫ్యాషన్, కళల రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. వారికి భారీ ఆదాయం చేకూరుతుంది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తి జీవితంలో సృజనాత్మకత పెరుగుతుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు ముఖ్యమైన వ్యక్తులతో చర్చించి తీసుకుంటే బాగుంటుంది. దీనివల్ల లాభనష్టాలు తెలియడంతోపాటు భారీమొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications