అయోధ్య రాముడే... భద్రాచల రఘు రాముడు

దక్షిణ భారతదేశంలో గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు వరం ఇస్తాడు ఆ వరం ప్రకారం సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడితో కలిసి ఇక్కడ వెలిశాడనేది స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి శ్రీరామచంద్రుణ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడు, చతుర్భుజ రాముడు, భద్రగిరి నారాయణుడనే పేర్లతో పిలుస్తారు.

భద్రాచలానికి ఘనమైన చరిత్ర ఉంది. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క ఎంతో భక్తితో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఒకరోజు ఆమె కలలో కనిపిస్తాడు. గతంలో తానిచ్చిన వరం ప్రకారం... భద్రగిరిపై ఉన్నానని.. తనను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యాలని, ఇందుకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశిస్తారు. ఈ విషయాన్ని దమ్మక్క గ్రామ పెద్దలందరికీ తెలిపి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించింది. అక్కడ పందిరి పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా పెడుతూ వచ్చింది. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణం నిర్వహించేవారని స్థలపురాణం చెబుతోంది.

bhadrachalams spiritual legacy: tracing the historyand architecture of sitharamaswamy tmple

తర్వాత భక్త రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడు మనం చూస్తున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం గోపన్న స్వగ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు గోపన్న మేనల్లుడు అవుతాడు. వారి సమకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహశీల్దారుగా నియమితులవుతాడు.

భద్రాచలం దేవస్థానం గురించి తెలుసుకున్న గోపన్న స్వామివారి భక్తుడిగా మారిపోతాడు. అనంతరం కబీర్ దాస్ శిష్యుడు శ్రీరామదాసుగా మారతాడు. భద్రాచల రాముడికి ఒక మంచి ఆలయం లేకపోవడం చూసి ఎంతో బాధపడతాడు. ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో ఆలయాన్ని నిర్మిస్తాడు.

ఈ విషయం నవాబైన తానీషాకు కోపం తెప్పిస్తుంది. వెంటనే సర్కారుకు చెల్లించాల్సిన సొమ్మును జమచేయాలంటూ ఆదేశాలు జారీచేస్తాడు. సొమ్ము మొత్తం ఆలయం కట్టడానికే వాడానని, తనదగ్గర ఏమీలేదని చెబుతాడు. దీంతో రామదాసును గోల్కొండకు పిలిపించి జైలులో ఉంచుతాడు. 12 సంవత్సరాలపాటు ఆ జైలులో అష్టకష్టాలు పడతాడు. తాను ఎదుర్కొంటున్న దుస్థితిని శ్రీరాముడికి తెలియజేస్తూ ఆలపించిన కీర్తనలు విశ్వవిఖ్యాతమవుతాయి. రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై స్వయంగా వచ్చి తానీషా బాకీ సొమ్ము చెల్లిస్తాడు. అంతేకాదు ఆ చెల్లించిన సొమ్ముకు రశీదు తీసుకొని రామదాసును బందిఖానా నుంచి విముక్తి కల్పిస్తాడు.

శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో ఉంటాయి. వాటిని వీక్షించొచ్చు. ఆలయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలో.. రామాయణ కాలంలో రాముడు, సీత, లక్ష్మణుడు నివసించిన పర్ణశాలతోపాటు రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా చెప్పుకొనే ఆధారాలను చూడొచ్చు.

గోదావరిలో నీటిప్రవాహం బాగున్న సమయంలో లాంచీలో పాపికొండలు మీదుగా భద్రాచలం వెళ్లడం జీవితకాలంలో మర్చిపోలేని మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. http://www.bhadrachalarama.orgలో మిగతా వివరాలు తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+