25న పుష్యపౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి!

2024 సంవత్సరంలో మొదటి పౌర్ణమి ఈనెల 25వ తేదీన పుష్యమాసం శుక్లపక్షం రోజు రాబోతోంది. ఆరోజు నదిలో స్నానాలు చేసి సూర్యుడిని పూజించడంవల్ల జన్మజన్మలకు సంబంధించిన అన్ని పాపాలు తొలగిపోతాయంటారు. ఈ ఏడాది రాబోతున్న పుష్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈనెల 24న కొన్ని యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీనివల్లే పుష్యపౌర్ణమికి ప్రాధాన్యత పెరిగిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

విష్ణుమూర్తి తో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం ఓ ఆనవాయితీ. పౌర్ణమి రోజు ప్రత్యేక సమయాల్లో విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయనే నమ్మకం బలంగా ఉంది. ఆరోజు ప్రత్యేక నియమాలతో పూజ చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆ నియమాల గురించి తెలుసుకుందాం.

blessings of godess lakshmi on pushya pournami 2024

పూర్వీకుల ఆశీస్సుల కోసం..
పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు తెల్లవారుజామునే నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగులో ఉన్న పట్టువస్త్రాలు ధరించి పూర్వీకులకు నైవేద్యాన్ని తయారుచేయాలి. తర్వాత వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడంవల్ల వారినుంచి ఆశీస్సులు లభించి కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.

పుష్య పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు..
నదీ స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి.
జ్యోతిష్య పండితులు చెప్పిన నియమాలను పాటించాలి.
పూజలో భాగంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి.
అనంతరం కనకధారా స్తోత్రం, శ్రీ సూక్త, విష్ణుసహస్త్రాణం పారాయణ చేయాలి.
లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి పేదలకు దానం చేయాలి. ఇలా చేయడంవల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగడంతోపాటు సంపాదన కూడా పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+