అర్థకేంద్ర యోగంతో ఈ రాశులవారి సుడి తిరిగింది
జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు, శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే అన్నీ మంచి పరిణామాలే జరుగుతాయి. సూర్యుడు వృషభరాశిలో, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. 18వ తేదీ రాత్రి ఈ రెండు గ్రహాలు 45 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా వచ్చాయి. దీనివల్ల అర్థవృత్తం ఏర్పడుతుంది. దీన్నే అర్థ కేంద్ర రాజయోగం అంటారు. దీనివల్ల అదృష్టం బాగా కలిసివస్తుంది. ఎంతో అరుదుగా సంభవించే ఈ అర్థ కేంద్ర యోగంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకుంటేనే విజయవంతమైనట్లు లెక్క. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంవల్ల భవిష్యత్తులో ఊహించనిరీతిలో లాభాలను అందుకుంటారు. ఏ పని తలపెట్టినా శుక్రుడిని, సూర్యుడిని స్మరించుకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. పెట్టుబడి పెట్టేముందు పెద్దల సలహా, జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈ రాశివారి సంపాదన అనూహ్యంగా పెరగనుంది. ఊహించనిరీతిలో వచ్చే డబ్బును సద్వినియోగపరుచుకోవాలి. మీ ప్రతిభకు మెచ్చే భగవంతుడు మంచి లాభాలను అందిస్తాడు. గొడవలన్నీ తొలగిపోయి జీవిత భాగస్వామితో కలిసిమెలిసి జీవిస్తారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.
మొదటినుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. మతపరమైన, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి బాగుంటుంది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మాటతీరు మార్చుకోవాలి. లేదంటే దీనివల్ల కూడా నష్టాలెదురయ్యే అవకాశం కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది.












Click it and Unblock the Notifications