హనుమజ్జయంతి వివాదం, ఓ వాదన
యత్రయత్ర రఘునాథకీర్తనమ్ తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారిపరిపూర్ణలోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్
ఎక్కడెక్కడ రామనామంవినబడుతుందో అక్కడక్కడ ఆనందాశ్రువులుకారుస్తూ, శిరసువంచి హనుమంతుడుంటాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ఆ జాడ్యం వాక్పటుత్వంచ హనూమత్‌స్మరణాద్భవేత్ హనుమంతుని స్మరణవల్ల మనకు బుద్ధి,బలం,కీర్తి,ధైర్యం,భయంలేనిస్థితి,బద్ధకం పోవటం, చక్కని మాట్లాడే శక్తి లభిస్తాయి.
హనుమదుపాసన తెలుగు రాష్ట్రాలలో,భారత్ లోనేకాక యావత్ ప్రపంచమంతా వుంది, ఐతే ఆంజనేయుని జీవితానికి ప్రామాణిక ఉపాసనా గ్రంథం ‘‘పరాశర సంహిత '' ఈ గ్రంథం ద్వారానే హనుమంతుని జననకథ ,వివాహాదుల వెనుక రహస్యం తాంత్రిక విశేషాలు చాలా ఉన్నవి. ఐతే హనుమజ్జయంతి వివాదం ఇది కొన్నిప్రాంతాలకే పరిమితం.

వైశాఖేమాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్రాప్రసూతాయ మంగళంశ్రీ హనూమతే - అని మంగళాష్టకాలు చెపుతున్నాయి.
అంటే ,వైశాఖమాసంలో బహుళపక్షంలో దశమి తిదథి పూర్వాభాద్రా నక్షత్రంతోకలిసిన శనివారం రోజున హానుమంతుని జన్మదినం అని చెప్పబడుతుంది. కానీ తెలంగాణావంటి కొన్నిప్రాంతాలలో రామనవమి అనంతర పౌర్ణమిగా జరుపుతారు. ఎందుకీ భేదం అంటే దీనికి పాఠాంతర నేపథ్యం ఒకటి ఉన్నది.
పైనచెప్పినది ప్రామాణికమే ఐనా ,లంకలో సీతాన్వేషణ చేసి సీతాదర్శనం చేసిన పౌర్ణిమను తాను జ్ఞానిగా పరతత్వ దర్శనం చేసి మరోజన్మనుపోందినట్లుగా హనుమత్సందేశంలో చెప్పినట్లు కొందరి వాదన, ఈ ప్రకారం హనుంతుని జన్మదినాన జయంతి జరపాలా ? హనుమంతుని ఆజ్ఞప్రకారం జరపాలా? అన్నది సందేహం .కానీ వారివారి ప్రాంతీయ ఆచారాలను గౌరవిస్తూ .వారి ప్రకారం రెంటినీ ఆచరించవచ్చు.
- మారుతి శర్మ












Click it and Unblock the Notifications