ఇంట్లో ఈ దేవుళ్ళ విగ్రహాలను పొరబాటున కూడా పెట్టకండి.. పెడితే కష్టాలు!!

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లోను ఒక చిన్న దేవుని గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో దేవుళ్ళు, దేవతామూర్తుల విగ్రహాలను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుంది. దేవతలను క్రమం తప్పకుండా పూజ చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విస్తరిస్తుంది.

పొరబాటున తెలిసీ తెలీక ఇంట్లో పెట్దుటుకోకూడని దేవతా మూర్తుల విగ్రహాలు పెడితే ఇంట్లో చిరాకులు పెరుగుతాయి. అయితే ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకునేటప్పుడు ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి? ఏవి పెట్టుకోకూడదు? వంటి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకోవాలి అనుకునేవారు రాహు కేతువుల విగ్రహాలను ఎప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు.

Do not put these idols of Gods in the house even by mistake; it gives negative results!!

ఇంట్లో రాహు కేతువుల విగ్రహాలు, చిత్ర పటాలు పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. ఆ కుటుంబ సభ్యులు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో మహంకాళి విగ్రహాన్ని పొరపాటున కూడా పెట్టుకోకూడదు. తల్లి దుర్గా మరియు పార్వతీదేవి యొక్క మరొక రూపంగా మహంకాళి ని భావిస్తారు. మహంకాళి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది.

ఇంట్లో నరసింహ స్వామి విగ్రహాన్ని ఎప్పుడూ పెట్టుకోకూడదు. దుష్టుడైన హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు నరసింహస్వామిగా భూమిపై అవతరించాడు. విష్ణువు యొక్క ఉగ్రరూపం అయిన నరసింహ స్వామి అవతారాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. అందుకే పొరపాటున కూడా నరసింహ స్వామి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెబుతున్నారు.

ఇక ఇంట్లో పెట్టుకో కూడని మరొక విగ్రహం శని దేవుడి విగ్రహం. శని దేవుడు విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకు రాకూడదని చెబుతున్నారు. కాబట్టి ప్రతినిత్యం ఇళ్లల్లో పూజలు చేసుకునేవారు, దేవుని గదిలో పెట్టకూడని విగ్రహాలను గురించి తెలుసుకొని ముందే జాగ్రత్త పడాలి. అవగాహన లేకుండా ఈ విగ్రహాలను తెచ్చుకుంటే అనవసరమైన నష్టాలు, కష్టాలు కలుగుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+