మహాశివరాత్రి రోజు వీటిని దానం చేస్తే ధనవంతులవుతారు!
భారతీయులు ఎంతో వైభవంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఆరోజు శివాలయాలన్నీ కిటకిటలాడతాయి. శివరాత్రి రోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది. దీనివల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో తెలియజేయబడింది. ఆరోజు ఏయే వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
శివుడికి ఎంతో ఇష్టమైనది ఆవు. ఆరోజ గోధుమపిండితో తయారు చేసిన చపాతీలను ఆవులకు తినిపిస్తే జీవితంలో ఎటువంటి సమస్యలైనా సులువుగా పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.

శివరాత్రి రోజున పాలను దానం చేయడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. శివుడికి పాలు అంటే ఎంతో ఇష్టం. పూజచేసిన అనంతరం పేదవారికి పాలను దానం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరడంతోపాటు పరమ శివుడి అనుగ్రహం లభిస్తుంది.
శివరాత్రి రోజు ఆవుపాలతో తయారుచేసిన నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించడంతోపాటు పేదలకు దానం చేయాలి. దీనివల్ల అదృష్టవంతులవుతారు.
మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఖీర్ నైవేద్యాన్ని దానం చేయాలి. శివరాత్రి రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ నైవేద్యాన్ని దానం చేయడం ఎంతో మంచిదని పురాణాల్లో తెలపబడింది.
శివరాత్రి రోజు శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానం చేయడం మంచిది. ఆరోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దుష్ప్రభావాలనుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
శివరాత్రి రోజు భక్తిశ్రద్ధలతో శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. అనంతరం నలుగురు పేదవారికి దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలాంటి దానంవల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. సందప కూడా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications