దీపావళి రోజు నుంచి ఈ రాశుల పంట పండింది
ఈనెల 29వ తేదీన ధన త్రయోదశి వచ్చింది. దీపావళికి ముందు దీన్ని సంతోషంగా జరుపుకుంటారు. ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. తరతరాలుగా, సాంప్రదాయంగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ధన త్రయోదశి రోజు చాలామంది బంగారాన్ని విక్రయిస్తారు. ఎక్కువమంది కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవితోపాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో ధనత్రయోదశికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈరోజు కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. కోరుకున్న కోరికలు కూడా నెరవేరతాయని చెబుతున్నారు.
మేష రాశి
కెరీర్ పరంగా జీవితంలో ఊహించనిరీతిలో మార్పులు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది. సంపద ఊహించనిరీతిలో పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సంపూర్ణ విజయం దక్కి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.

మకర రాశి
ఏ పనిలోనైనా అదృష్టం తోడుంటుంది. పనులన్నీ సులువుగా అయిపోతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయాన్ని బాగా ఆర్జిస్తారు. శ్రమ పడినదాన్ని బట్టి ఫలితం ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. కొంతకాలం నుంచి అనుకుంటున్న పనులు ఈ సమయంలో అవుతాయి. ఉద్యోగం, వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది.
సింహ రాశి
కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరి మధ్య శాంతి కలుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయంలో లాభాలు కలుగుతాయి. ఎంతోకాలం నుంచి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేయాలి.












Click it and Unblock the Notifications