ఈ రాశులకు రాజయోగంతో అద్భుత ధనయోగం
గ్రహాలకు రారాజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అలాగే శుక్రుడు బృహస్పతితో పరివర్తనం చెందాడు. ఈ మూడు గ్రహాలకు తోడు శనిదేవుడు రుజుమార్గంలోనే సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఐదు రాశులకు బలం పెరిగింది. ఆర్థికంగా కలిసిరావడం, మంచి స్థాయికి చేరుకోవడం, కెరీర్ లో ఎదుగుదలతోపాటు కొత్త విజయాలు లభిస్తాయి. వీటికితోడు అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడి వివాదాలన్నీ సద్దుమణుగుతాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశివారు భారీగా లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఉద్యోగులకు ప్రమోషన్ ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆదాయం విషయంలో పెరుగుదల ఉంటుంది.

సింహం
ఈ రాశివారికి రాజయోగం పడుతుంది. సమాజంలో పైస్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించి కొత్తవాటిని కొనుగోలు చేస్తారు. కొన్నాళ్ల నుంచి ఉన్న ఆస్తి వివాదం పరిష్కారమై ఆస్తి కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది.
తుల
అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు రావడంతోపాటు శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి, సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
మకరం
ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభార్జన ఉంటుంది. చురుగ్గా వ్యాపారం సాగుతుంది. మొత్తంగా ఆదాయపరంగా అనుకూలత పెరుగుతుంది.
కుంభం
రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయంలో రాజయోగాలు పట్టుకుంటాయి. సమాజ సేవలో పాల్గొంటారు. ఈ రాశివారి శశ మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.












Click it and Unblock the Notifications