వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి ఆరోగ్యానికి ఆయుర్వేద పద్దతులు తెలుసుకోండి..!

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యం విష‌యంలో ఆహారం పోషించే పాత్ర‌
మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ 'ఇంధనం'లా పని చేస్తుంది. అయితే ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా మ‌నం ఏ ఆహారం తీస‌సుకుంటున్నామో నియంత్ర‌ణ లేకుండా పోయింది. ఈ క్ర‌మంలో ఆహారం, శ‌రీర త‌త్వం, శ‌రీర ర‌సాయ‌న క్రియ‌లు, ఆహారం ప్ర‌భావం మ‌న మీద పడి అనేక సమస్యలకు కారణం ఔతుంది. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏంచేయాలి, ఏం చేయకూడదో చూద్దాం.

* ప్రాతఃకాలంలో నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం .

* ప్రాతఃకాలంలో నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగాలి, దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును.

* నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను. మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .

Follow the ayurveda tips for good health benifits

* దంతధావనం నందు నాలుకను, దంతములను శుభ్రపరచుకోవలెను. నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటిలోని క్రిములను తొలగించు గుణము కలిగి ఉంటుంది.

* దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను. చిగుళ్లలో వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను.

* స్నానానికి ముందు గోరువెచ్చగా కాచిన నువ్వులనూనెతో శరీరాన్ని మర్ధించుకొని కొంతసేపు లేత సూర్యకిరాణాలలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాల నూనెను కూడా వాడుకోవచ్చు . ఆవాలనూనె చాలా శ్రేష్టం. ఔషధ తైలాలు కూడా వాడవచ్చు.

* శరీరానికి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా తయారగును.

* కీళ్లు, కండరాలు కదలికలు మంచిగా జరుగును.

* రక్త ప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా, మలపదార్థాలు త్వరగా తొలగించబడును.

* రోజు వాకింగ్ మరియు ప్రాణాయామం, యోగాసనాలు వేయవలెను .

* స్నానం గొరువెచ్చటి నీటితోనే చేయవలెను .

* గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును. రోమకూపములు , స్వేద రంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును.

* నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను. షడ్రుచోపేతమైన తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను .

* జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను .

* భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను .

* గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను .

* సాధ్యం అయినంత వరకు ఆహారం తిన్న తర్వాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .

* అతిగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు .

* ఆహారం తినుటకు 15 నిమిషాలలోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్య మధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు .

* ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు

* భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను .

* దక్షిణం, తూర్పు దిశ వైపు తల పెట్టి నిద్రించవలెను.

* నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విధంగా ఉండవలెను .

* నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను .

* గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను .

* మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట, ఆలోచించుట, మద్యపానం, కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు .

* రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను .

* పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను .

* నిద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన పీడ కలలు రాకుండా ఉంటాయి.

* మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును. మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును. అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు .

* మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం, అజీర్ణం, అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు వంటి సమస్యలు మొదలగును. కావున మలవిసర్జన ఆపకూడదు.

* వాంతిని ఆపుట వలన దద్దుర్లు, తలతిరగడం, రక్తహీనత, కడుపులో మంట, చర్మరోగాలు మరియు జ్వరం కలుగును.

* తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కు నుండి అదేపనిగా నీరు కారే పీనసరోగం, తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు .

* త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు, ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును.

* ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును .

* ఆకలి, దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకతని తెలియచేస్తాయి. వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు సంభవిస్తాయి. శరీరం పొడిగా మారును.

* కన్నీటిని ఆపుట వలన మనసిక వ్యాధులు, ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి .

* శ్వాస ప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు కలిగి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేయును. ఒక్కోసారి మరణం కూడా కలుగును.

* నిద్రని ఆపుట వలన నిద్రలేమి, మానసిక వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును.

* పై వాటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు. ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంది.

English summary
Follow the ayurveda tips for good health benifits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X