ఉదయించిన బుధుడు.. జూన్ 30వరకు ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బుధుడిని తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలు, వ్యాపారం, తార్కిక జ్ఞానం, సంపదకు అధిపతిగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే, వృత్తి, వ్యాపారాలలో తిరుగులేని విజయాలు సాధ్యమని చెప్తారు.
ఉదయించిన స్థితిలో బుధుడు.. వీరిదే అదృష్టం
హిందూ క్యాలెండర్ ప్రకారం, బుధ గ్రహం ప్రస్తుతం ఉదయించిన స్థితిలో సంచరిస్తోంది. ఈ స్థితి జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఉదయించిన బుధ సంచారం అన్ని రాశిచక్రాల వారి జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా బుధుడి శుభదృష్టి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్‌తో పాటు ఆర్థికాభివృద్ధిలో అద్భుతమైన శుభవార్తలు అందుకుంటారు. ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం, లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.

మిథున రాశి
మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడి ఉదయించిన స్థితి వీరికి అన్ని విధాలా లాభం చేకూరుస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, భారీ జీతంతో కూడిన కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపార రంగంలో పెద్ద డీల్స్ కుదురుతాయి, లాభాలు పెరుగుతాయి. గతంలో ఇరుక్కుపోయిన బకాయిలు తిరిగి చేతికి అందుతాయి.
కన్యా రాశి
కన్యా రాశికి కూడా బుధుడే అధిపతి. బుధుడి ఉదయం వల్ల జీవితంలో అపారమైన సానుకూలత, మనశ్శాంతి వస్తాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది.కోర్టు కేసులు, వివాదాలలో విజయం లభిస్తుంది. నిర్ణయాధికారం బలపడటంతో, మీ పనితీరును కార్యాలయంలో పై అధికారులు అభినందిస్తారు. కుటుంబ కలహాలు తొలగి, బంధాలు బలపడతాయి. ఇంట్లో శుభకార్యాలు లేదా కీలక పనులు ప్రారంభించగలరు.
సింహ రాశి
సింహ రాశి వారికి బుధుడి ఉదయం విపరీతమైన ఆర్థిక లాభాలను తెస్తుంది. సొంత ఇల్లు, స్థలం లేదా కొత్త వాహనం కొనాలనే కల ఈ సమయంలో నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సీనియర్లు, తోటి ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ గణనీయంగా మెరుగుపడతాయి. మాటల చాతుర్యంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుని, పనులను సఫలం చేసుకుంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బుధుడి ఉదయం అదృష్టాన్ని మారుస్తుంది. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు శుభవార్తలు అందుకుంటారు. విదేశీ మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు, దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. గత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్థలు ఈ కాలంలో పూర్తిగా తొలగిపోయి, వారి మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది.
గమనిక: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలు, ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంది. మీ వ్యక్తిగత జాతకం, గ్రహాల స్థితి వివరాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం ఉత్తమం.













Click it and Unblock the Notifications