భారత్ సృష్టించిన అతి పెద్ద 'అస్త్రం'.. చైనా, పాకిస్థాన్ లోని ప్రతి ఇంచు ఖతం..!
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థల్లో భారత్ ఒకటి. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును తిప్పి కొట్టేందుకు, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించేందుకు డీఆర్డీఓ, భారత సైన్యం సంయుక్తంగా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా దాడి చేయగల అత్యాధునిక క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం భారత క్షిపణి సామర్థ్యం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
అగ్ని సిరీస్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, పృథ్వీ, ప్రళయ్ లాంటి అల్ప శ్రేణి క్షిపణులు అలాగే బ్రహ్మోస్, నిర్భయ్ లాంటి క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. వీటితోపాటు ఎస్- 400 ట్రయంఫ్, ఆకాశ్,ఎంఆర్ సామ్(బరాక్ 8) రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇక భారత్ తన రక్షణ విధానంలో నో ఫస్ట్ యూజ్ విధానాన్ని పాటిస్తోంది. అంటే భారత్.. ఏ దేశం పైనా మొదటగా అణుదాడి చేయదు.. కానీ మనదేశంపై దాడి చేస్తే మాత్రం శత్రు దేశం ధ్వంసం అయ్యేంత రేంజ్ లో ఆయుధ సంపత్తిని భారత్ సిద్ధం చేసుకుంది. గతేడాది పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ క్షిపణులు, రక్షణ వ్యవస్థలు పాకిస్థాన్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రయోగించిన చైనా, టర్కీకు చెందిన డ్రోన్లు, ఆయుధాలను భారత్ ఇట్టే భూస్థాపితం చేసింది.
అయితే తాజాగా భారత్ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన క్షిపణి చేరనుంది. అదే అగ్ని-6.. ఈ క్షిపణి ధ్వని వేగం కంటే దాదాపు 24 రెట్లు ఎక్కువ వేగంతో అంటే గంటకు 29,000 కిలోమీటర్లతో దూసుకెళ్తుంది. ఇంతటి హైపర్ సోనిక్ వేగంతో వచ్చే క్షిపణిని అడ్డుకోవడం ఏ శత్రు దేశ రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఇక అగ్ని-6 క్షిపణి పరిధి దాదాపు 8 వేల నుంచి 12,000 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే ఇది కేవలం ఆసియా ఖండాన్నే కాకుండా.. మొత్తం యూరోప్ ఖండాన్ని కూడా తాకగలదని అర్థం.
ఇక ఇందులో ఎంఐఆర్ వీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాంతో ఒకే ఒక్క అగ్ని-6 క్షిపణి ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 10 విభిన్న లక్ష్యాలపై అణుబాంబులతో దాడి చేసే సామర్థ్యం ఉంది. అలాగే అగ్ని-6 కు వేగంగా వెళ్లగలిగే సామర్థ్యం మాత్రమే కాకుండా ఇందులో ఎంఏఆర్ వీ టెక్నాలజీ కూడా ఉంది. అంటే గాల్లో ప్రయాణించేటప్పుడు శత్రువుల రాడార్లు లేదా యాంటీ- మిసైల్ సిస్టమ్స్ దీనిని టార్గెట్ చేస్తే.. ఇది తన ప్రయాణ మార్గాన్ని స్వయంగా మార్చుకుని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఈ మేరకు డీఆర్డీఓ ఈ క్షిపణికి సంబంధించిన సాంకేతిక పనులన్నింటినీ పూర్తి చేసింది.

అయితే అగ్ని-6 మిసైల్ పై చైనా, పాకిస్థాన్ ఆందోళన చెందుతున్నాయి. ఈ క్షిపణి పరిధి చైనా, పాకిస్థాన్ లోని ప్రతి సెంటిమీటర్ భూ భాగాన్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాల వ్యూహాత్మక స్థావరాలకు ఇది పెద్ద ముప్పుగా మారింది.












Click it and Unblock the Notifications