కేటీఆర్, జగన్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..! ఆస్తి కోసం చెల్లెళ్లను..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ తన రాజకీయ ప్రత్యర్ధులైన కేటీఆర్, వైఎస్ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వారి కుటుంబ అంశాల్ని తెరపైకి తెచ్చి, వాటిని రాజకీయాలతో లింక్ చేస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, వైఎస్ జగన్ కు తమ సోదరీమణులలతో ఉన్న ఆస్తి వివాదాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత చెల్లినే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన వైనం, ఆ తర్వాత అన్నపై శాపనార్థాలు పెట్టే పరిస్థితులను ఇటీవల రాజకీయాల్లో చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాంనిచారు. కుటుంబాలు, ఆస్తి పంపకాల వివాదాల చుట్టూనే కొన్ని రాజకీయ పరిణామాలు తిరుగుతున్నాయని రేవంత్ తెలిపారు. అయితే ఆయన నేరుగా కేటీఆర్ కానీ వైఎస్ జగన్ పేరు కానీ ప్రస్తావించలేదు. అయినా ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో అందరికీ అర్దమవుతోంది.

సొంత చెల్లి కూడా భారమైందనుకుని, ఆస్తిలో వాటా అడుగుతారని ఇంట్లో నుంచి పంపించేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే జగన్ కు సన్నిహితుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మహిళా మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. వీరంతా రేవంత్ వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడుతూ కనిపించడం విశేషం.












Click it and Unblock the Notifications