తమిళనాడు రైతులకు విజయ్ కానుక..! రుణాలు మాఫీ..!

తమిళనాడులో రైతులకు సీఎం విజయ్ (CM Vijay) గుడ్ న్యూస్ చెప్పారు. రైతులు గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రుణాలు ఎవరెవరికి, ఎంత మేరకు అన్న అంశాల్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేసింది. దీంతో తమిళనాడులో గత ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని విజయ్ నిలబెట్టుకున్నట్లు అయింది.

తమిళనాడు సీఎం విజయ్.. చిన్న రైతుల కోసం సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ.50,000/- వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. పంట రుణమాఫీ పథకం కింద గతేడాది మే 1నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్న 14.22 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఈ పథకం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి ₹2,044 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. రాబోయే సాగు సీజన్ కోసం కొత్త రుణాలు కోరుకునే రైతులకు ఈ పంట రుణమాఫీ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

CM Vijay Announces Crop Loan Waiver up to Rs 50 000 for Small Farmers via Cooperative Banks

చిన్న రైతులతో పాటు పెద్ద రైతులకు సైతం తమిళనాడు ప్రభుత్వం ఓ చిన్న ఊరటనిచ్చింది. పెద్ద రైతుల పంట రుణ చెల్లింపు కోసం రూ.5,000 మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ రుణమాఫీ వెంటనే జరుగుతుందా లేక ఎప్పుడు చేస్తారన్న దానిపై ప్రభుత్వం త్వరలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా విజయ్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకోవడంపై మాత్రం ప్రజల్లో సానుకూల స్పందన వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+