ఈ నెల 16 నుంచి ఈ రాశులవారి సుడి తిరిగింది.. మహర్జాతకులవుతున్నారు

ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు. దీన్ని వృశ్చిక సంక్రాంతి అంటారు. అప్పటికే అక్కడ బుధుడు సంచారం చేస్తుంటాడు. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండూ కలవడం అనేది శుభ పరిణామంగా పండితులు భావిస్తారు. సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీనివల్ల మూడు రాశులవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండటమేకాదు వారికి ఆర్థికంగా ఎన్నో లాభాలను తెచ్చిపెడుతోంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

మకర రాశి
తల్లిదండ్రుల నుంచి సంపూర్ణంగా మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో భూమిని లేదంటే కొత్త వాహనాన్ని లేదంటే భవనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలున్నాయి. బుధాదిత్య యోగం ఈ రాశివారికి మంచి శుభాలను కలిగిస్తోంది. వ్యాపారస్తులకు మంచిరోజులు వచ్చినట్లే లెక్క. విద్యార్థులకు, పోటీపరీక్షలకు సిద్ధపడేవారికి చాలా బాగుంటుంది.

four zodiac signs will get all benefits due to budhdhitya rajayogam from november 16th

కుంభ రాశి
ఉద్యోగంలో పదోన్నతి లేదంటే ఆదాయం పెరుగుదల కోసం చూస్తుంటే ఇప్పుడు అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందడంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. భవిష్యత్తులో మంచి రాబడినిస్తుంది.

తులా రాశి
ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే వాటినుంచి బయటపడతారు. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు.

వృశ్చిక రాశి
ఈ రాశిలోకే సూర్యుడు ప్రవేశించడంవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. సూర్యుడు, బుధుడి కలయిక వీరికి వరంలాంటిదని చెప్పొచ్చు. కొత్తగా వ్యాపారాలు చేయాలుకుంటున్నవారికి ఇది మంచి సమయం. గతంలో ఎవరికైనా ఇస్తే నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. శారీరకంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+