ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ రాశులకు గోల్డెన్ డేస్
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, గ్రహాల రాకుమారుడైన బుధుడు వచ్చే నెల 1వ తేదీన సంయోగం చెందుతారు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఒకటో తేదీ నుంచి కొన్ని రాశులవారి జాతకం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ యోగం వారి జీవితాలను ఏవిధంగా మార్చివేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి
ప్రభుత్వానికి సంబంధించిన పథకాలద్వారా మంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రాశివారి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడి మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల బాగా కలిసివస్తుంది. సూర్యుడు, బుధుడి గ్రహాల కలయికతో సింహరాశివారు విజయాలను అందుకుంటారు.

తులా రాశి
ఆర్థికంగా అనేక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంపాదన భారీగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. సమాజంలో పేరు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి తెల్లటి వస్త్రాలు ధరించి నెయ్యితో దీపారాధన చేయడంద్వారా అన్నీ శుభాలే కలుగుతాయి.
మిథున రాశి
వ్యాపారంలో ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. రెండు గ్రహాల కలయికతో ఏర్పడుతున్న యోగం మంచి ఫలితాలను కలిగించడంతోపాటు సమాజంలో గౌరవాన్ని కల్పించనుంది. రాగి పాత్రలో నీళ్లు పోసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడంద్వారా, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించడంద్వారా మిథునరాశివారు విశేషమైన ఫలితాలను పొందుతారు.
కన్యా రాశి
ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. దాంతోపాటు వేతనం పెరుగుతుంది. వీరు పచ్చి గడ్డిని ఆవుకు తినిపించడంద్వారా అనేక శుభ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు పరీక్షల్లో విజయం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతారు.












Click it and Unblock the Notifications