ఈ నెల30 నుంచి చైత్ర నవరాత్రులు... ఈ రాశులపై 9 రోజులు దుర్గమ్మ కనక వర్షం
ఈనెల 30వ తేదీ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. చైత్ర నవరాత్రులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. దసరా నవరాత్రుల్లానే చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి ఏనుగుపై స్వారీ చేసి రాశిచక్ర గుర్తులను అనుగ్రహిస్తారు. దీనికి ఒకరోజు ముందు కర్మ ఫలదాత అయిన శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న చైత్ర నవరాత్రుల్లో ఆరోజు అమ్మవారి వాహనం ఏనుగు. ఏనుగుపై స్వారీ చేస్తూ దుర్గామాత ఏయే రాశులను అనుగ్రహిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
తులా రాశి
కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. చిక్కులన్నీ తొలగిపోతాయి. దుర్గాదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండటంవల్ల ఈ రాశివారంతా ఎంతో సంతోషంగా జీవిస్తారు.

మకర రాశి
కెరీర్ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా లాభాలున్నాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో మద్దతు లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. దుర్గమ్మ ఆశీస్సులు పుష్కలంగా లభించి కోరుకున్న ఉద్యోగం నిరుద్యోగులకు లభిస్తుంది.
కర్కాటక రాశి
చైత్ర నవరాత్రుల్లో కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. లేదంటే కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కెరీర్ పరంగా అన్నిరంగాల్లో ఉన్నవారి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్థులకు మంచి శుభవార్తలు ఎదురుచూస్తున్నాయి. అమ్మవారిని పూజించడంవల్ల మరిన్ని ఫలితాలను అందుకుంటారు.
కన్యా రాశి
ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా ఉంటారు. డబ్బును పొదుపు చేసుకుంటారు. ఉద్యోగస్థులకు కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. దుర్గాదేవి అనుగ్రహంతో సమాజసేవపై ఆసక్తి, ఆధ్యాత్మిక వాతావరణంపై అనురక్తి కలుగుతుంది.












Click it and Unblock the Notifications