వెండి పాదాలతో శని... 2027 వరకు ఈ రాశులకు వద్దన్నా డబ్బే
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు శనిదేవుడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేందుకు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శని దేవుడు వెండి పాదాలతో కదులుతున్నాడు.
2027 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల నాలుగు రాశులవారి సంపాదన పెరగనుంది. శని ప్రభావంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శనిదేవుడు అంటే అందరూ భయపడతారుకానీ ఆయన ఎంతో మంచి చేస్తాడు. 2027 వరకు అత్యధిక లాభాలను పొందనున్న రాశుల వివరాలను, ఆ రాశుల్లో మీ రాశి ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకుందాం.

కుంభ రాశి
ఈ రాశివారికి సంపద అనూహ్యంగా పెరుగుతుంది. ధనవంతులవుతారు. ఈ రాశివారు అద్భుతమైన ప్రయోజనాలను శనిదేవుడి వల్ల పొందబోతున్నారు. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లయినవారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
మకర రాశి
ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీవితంలో ఊహించనిస్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు. చేసే ప్రతి పనిలోను అదృష్టం కలిసివస్తుంది. అడుగు పెట్టిన ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు. అనేక ప్రయోజనాలు పొందుతారు. రెండున్నర సంవత్సరాలు వీరికి తిరుగులేదని చెప్పొచ్చు.
వృశ్చిక రాశి
ఆర్థిక లాభాలున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులున్నాయి. శని గ్రహం వెండి పాదాలతో కదులుతుండటం వీరికి బాగా కలిసివస్తుంది.
కర్కాటక రాశి
ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. అవకాశాలు తలుపు తడుతూనే ఉంటాయి. పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాపారాలు చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. అదృష్టవంతులవుతారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శివాలయాల్లో, ఆంజనేయస్వామి ఆలయాల్లో, ఇతర ఆలయాల్లో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, శనిదేవుడికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది.












Click it and Unblock the Notifications