రాసిపెట్టుకోండి.. ధనుర్మాసంలో ఈ రాశులు మిలియనీర్లు అవుతున్నారు
వైష్ణవ సంప్రదాయాన్ని ప్రారంభించే భక్తులకు ఎంతో పవిత్రమైన మాసం ధనుర్మాసం. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని ప్రజలు ఆండాళ్ దేవిని (గోదాదేవిని) ఆరాధిస్తారు. అందరూ ఆండాళ్ రచించిన తిరుప్పావైని పఠిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కల్యాణం జరుగుతుంది. ఈ మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం కూడా ఈ మాసం అత్యంత శుభ్రదమైంది. శుక్రుడు, కుజుడి కలయిక కూడా జరుగుతోంది. దీనివల్ల సంసప్తక యోగం ఏర్పడనుంది. ఇది చాలా శక్తివంతమైన యోగం. దీనివల్ల ఏయే రాశులవారు ఏవిధంగా లాభపడుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
వీరికి కెరీర్ చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తగా భూమిని లేదంటే భవనాన్ని, లేదంటే ఇతర ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేయడంవల్ల ఆ పని విజయవంతంగా ముగుస్తుంది.

సింహరాశి
ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయి వస్తుంది. ఒకరకంగా వీరికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు ప్రణాళికలు రచించి అమలు చేస్తారు.
కన్యారాశి
ఈ సమయంలో ఈ రాశివారు తీర్థయాత్రలకు వెళతారు. ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. డబ్బు వచ్చిన తర్వాత దాన్ని పొదుపు చేయడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.
తులా రాశి
ఉద్యోగాలు చేసేవారికి వారి కార్యాలయాల్లోని సీనియర్ల నుంచి, ఇతర ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కీర్తి పెరగడంతోపాటు సంతోషం కలుగుతుంది. జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఎరగని సంతోషంగా జీవిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications