కార్తీక మాసంలో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్న రాశులు వీరే
మాసాల్లోకెల్లా పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. జ్యోతిష్యం ప్రకారం కూడా ఈ మాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది. మొదటివారంలో పరమేశ్వరుణ్ని ద్వాదశ రావులవారు పూజించడంవల్ల విశేషమైన డబ్బును పొందబోతున్నారు. వీరికి అదృష్టం తోడుంటుంది. ఈనెల తొమ్మిదోతేదీ వరకు ఈ రాశులవారికి తిరుగులేదు. పరమ శివుణ్ని పూజించడం, దీపాలు వెలిగించడం, దానాలు తదితరాలవాటివల్ల ఈ రాశులవారు సంపదను పొందబోతున్నారు. ఏయే రాశులవారికి ఏ విధగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి
గతంలో ఎక్కడైతే పనులు ప్రారంభమై ఆగిపోయాయో అవి తిరిగి ప్రారంభమవుతాయి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి సన్మానాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ సమయంలో అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల నుంచి బయటపడతారు. అనారోగ్యం పొంచివుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం తిరిగి మొదలవుతుంది. నిరుద్యోగులకు పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశం తలుపు తడుతుంది.

వృషభ రాశి
గతంలో వీరు ఎన్నడూ పొందని ప్రయోజనాలను పొందుతారు. కోరుకున్న రీతిలో సంపద వస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగే సమయం ఇది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో, స్నేహితులతో కలిసివున్న సమయంలో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అవే పెద్దవవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తే కలిసివస్తాయి.
మకరరాశి
కొత్తగా పనులు ప్రారంభించేవారు లాభాల బాటలో సాగుతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వీరు ఏ పని తలపెట్టినా అఖండ విజయం సాధించడం తథ్యం. ఉద్యోగస్తులు ఒత్తిడి నుంచి బయటపడతారు. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. కళల రంగంలో ఉన్నవారికి సమాజంలో సన్మానాలు, అవార్డులు వరిస్తాయి.
ధనుస్సు
స్థిరాస్తుల్లో ఎప్పటినుంచో ఉన్న వివాదం పరిష్కారమవుతుంది. ఈ వారం చివరి రోజుల్లో ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. కష్టపడి పనిచేయడంవల్ల గతంలో ఎన్నడూ కళ్లచూడని డబ్బులను కళ్లచూస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారికి చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఈ మాసంలో పరమేశ్వరుణ్ని పూజించాలి.












Click it and Unblock the Notifications