జూన్ 14 నుంచి ఈ రాశులకు మహర్దశ
ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున యోగిని ఏకాదశిని జరుపుకుంటారు. విష్ణుమూర్తిని ఆరోజు పూజిస్తారు. శ్రీహరిని పూజించడంవల్ల అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకంతో ఉంటారు. వ్రతాన్ని ఆచరించడంవల్ల చనిపోయిన తర్వాత మహావిష్ణువు పాదాల చెంతకు చేరుకుంటారు. యోగినీ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అది 88 వేలమంది బ్రాహ్మణులకు దానం చేయడంతో సమానంగా భావిస్తారు. ఏకాదశి తిథి జూన్ 13వ తేదీ ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై.. 14వ తేదీ ఉదయం 8.48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, జూన్ 14న యోగిని ఏకాదశి వ్రతం జరుపుకుంటారు. ఇది ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మిధునరాశి : ఏకాదశి మిథునరాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వీరు వృత్తి రీత్యా ఏ రంగంలోకి అడుగుపెట్టినా అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు. అదృష్టం వీరికి తోడుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం బలోపేతమవుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి : ఈ రాశివారికి యోగినీ ఏకాదశి ఊహించనిరీతిలో లాభాలనిస్తుంది. కెరీర్ లో అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. వీరు చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం తోడుంటుంది. అంతేకాకుండా వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. గతంలో చేపట్టి ఆగిపోయిన పనులన్నింటినీ ఇప్పుడు పూర్తిచేస్తారు.
కన్యారాశి : వీరి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులు ఊహించనిరీతిలో లాభాలను గడిస్తారు. పెట్టుబడి పెట్టడంద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఎటువంటి కార్యాన్నైనా వీరు సులువుగా పూర్తి చేస్తారు. అందుకు అదృష్టం కూడా వీరికి తోడుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి అపోహలు ఉండవు. వీరి మధ్య బంధం దృఢమవుతుంది.












Click it and Unblock the Notifications