ఈనెల 17న ఇలా చేయండి.. ఆర్థికంగా కలిసి వస్తుంది
ఈనెల 17వ తేదీ నంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి అక్టోబరు రెండోతేదీ వరకు ఉంటాయి. మనిషి భగవంతుడి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో మరణించి పైలోకాన ఉన్న తన పితృదేవతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని పండితులు తెలియజేస్తున్నారు. వీరికి విడిచే తర్పణాలు, పిండ ప్రదానాలతోపాటు దానధర్మాల్లాంటి కార్యక్రమాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మన పూర్వీకులను సంతోష పెట్టడం, వారికి నచ్చిన పని చేయడంలాంటివి చేయాలి. ఇలాంటివి చేయడంవల్ల వారు మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
భాద్రపద మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజు నుంచి పితృపక్షం ప్రారంభమై కృష్ణ పక్షం అమావాస్య వరకు ఉంటుంది. బ్రహ్మపురాణం ప్రకారం మన పూర్వీకులను పూజించడంతోపాటు నైవేద్యాలు సమర్పించాలి. వారికి శ్రాద్ధం పెట్టడంద్వారా రుణం తీర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. శ్రాద్ధం పెట్టే రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. చేతిలో నువ్వులు లేదంటే జలం, అక్షతలు మొదలైనవాటిని తీసుకొని పూర్వీకులకు సమర్పించాలి. దీన్నే తర్పణం అంటారు. ఆ తర్వాత రెండుచేతులతో నమస్కారేం చేసి పెద్దలను ధ్యానం చేసి మంచినీరు తాగడానికి వారిని ఆహ్వానించాలి.

దీనివల్ల మన పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. వారి పేరుతో అన్నదానం, వస్త్రదానం చేస్తే కుటుంబ సభ్యులెవరకీ ఆర్థిక కష్టాలు రావు. పితృదోషం ఉన్నవారు ఈ సమయంలో కచ్చితంగా తర్పణం వదలడం చేస్తే మంచిది. ఇలా చేయడంవల్ల దోషం నుంచి బయటపడతారు. పితృపక్షం సమయంలో మన పూర్వీకులు చీమ, కుక్క, కాకి, ఆవు, బావి రూపంలో వచ్చి ఆహారం తీసుకుంటారనే నమ్మకం ఉంది. పితృపక్షం సమయంలో ఐదు వంతుల ఆహారాన్ని తొలగిస్తారు. బార్లీ లేదంటే బియ్యపు పిండిని గుండ్రంగా చేసి పిండదానం చేస్తారు. ఇలా చేసేందుకు గయ మంచి ప్రదేశం.












Click it and Unblock the Notifications