దీపావళి రోజు లక్ష్మీదేవిని ఈ సమయంలో పూజించండి..
దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి అనేది దీపాల పండుగ. ఆ రోజు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరతాయని, సంపద వర్షంలా కురుస్తుందని ప్రజలు ప్రబలంగా నమ్ముతారు. ఈ సంవత్సరం 12 నవంబర్ 2023 న దీపావళి జరుపుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడు, సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. హిందూ మతంలో, శుభ సమయంలో లక్ష్మిని పూజిస్తారు. ఈ ఏడాది దీపావళి రోజు సింహరాశి, వృషభ రాశిలో ఉన్నవారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అమ్మను ప్రసన్నం చేసుకోవచ్చు.
వృషభ, సింహ రాశిలో లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. 12వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 7.57 గంటల వరకు వృషభ రాశి, మధ్యాహ్నం 12.28 గంటల నుంచి తెల్లవారుజామున 2.43 గంటల వరకు సింహ రాశి ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీ ఆరాధన ఉత్తమమైనదిగా పండితులు చెబుతున్నారు. ప్రదోష కాలంలో కూడా లక్ష్మీ పూజ చేయవచ్చు. సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 9.04 గంటల వరకు పవిత్రమైన చోఘడియ ఉంది. అలాగే ఉదయం 9.04 నుంచి రాత్రి 10.43 గంటల వరకు, మధ్యాహ్నం 2.01 గంటల నుంచి 3.40 గంటల వరకు లక్ష్మీదేవిని పూజించవచ్చు.

జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత రోజు అతడి పీడ వదిలిందనే సంతోషంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.












Click it and Unblock the Notifications