వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!

|
Google Oneindia TeluguNews

సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం. చేతులెత్తి దేవుడిని ప్రార్థించడం వల్ల మనకు శారీరక శక్తి లభించడంతోపాటు, మానసిక బలం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం చేకూరుతాయని పెద్దలు చెప్తారు. పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆలయాలకు వెళ్ళటం మనసుకు ప్రశాంతత కలిగిస్తుందని చెప్తున్నారు.

Vastu Tips: పొరపాటున కూడా ఈ 4పనులు చేయకండి; ఇంటికి దరిద్రం వచ్చి పడుతుందిVastu Tips: పొరపాటున కూడా ఈ 4పనులు చేయకండి; ఇంటికి దరిద్రం వచ్చి పడుతుంది

దేవాలయాలకు వెళ్ళేవారు ఈ పనులు చెయ్యరాదు

దేవాలయాలకు వెళ్ళేవారు ఈ పనులు చెయ్యరాదు


దేవాలయానికి వెళ్లేవారు చెయ్యకూడని తప్పులను కూడా వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దేవాలయానికి వెళ్లేవారు దేవాలయ ప్రాంగణంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళరాదు. అలాగే మాంసాహార భోజనం భుజించిన తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ దేవాలయంలోకి వెళ్ళరాదు. దేవాలయంలో భగవంతుని పూజించే సమయంలో అన్యమనస్కంగా ఉండరాదు. పూర్తి విశ్వాసాన్ని భగవంతునిపై లగ్నం చేసి దేవుని దర్శనం చేసుకోవాలి.

ఆలయాల నింధనలకు భంగం కలిగించరాదు

ఆలయాల నింధనలకు భంగం కలిగించరాదు


దేవాలయంలో ఉండే పాజిటివ్ వైబ్స్ వల్ల దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరూ కాస్త మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక అటువంటి చోట ఆలయ నియమాలకు భంగం కలిగించే పనులు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఆలయాలలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు చాలామంది దేవునికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దేవాలయాలలో దేవుళ్ళను దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదా ఎడమవైపున నిలబడి దర్శనం చేసుకోవాలి తప్ప, పొరపాటున కూడా ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు.

దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోరాదు

దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోరాదు


దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో ఎన్నో శక్తులను విగ్రహానికి ఆపాదించి విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఇక భగవంతుని శక్తి తరంగాల రూపంలో ఆలయానికి వచ్చే భక్తులు వద్దకు చేరుకుంటుంది. అయితే ఈ విగ్రహాలు ఎదురుగా నిలబడి దర్శనం చేసుకుంటే ఆ తరంగాలు నేరుగా మానవ దేహంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే అత్యంత శక్తివంతమైన ఆ తరంగాలను తట్టుకోలేరు అనే ఉద్దేశంతో దేవాలయాలలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు ఎడమవైపున కానీ, కుడివైపున కానీ నిలబడి దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు. పొరపాటున కూడా దేవుడికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదని చెబుతున్నారు.

విగ్రహాలను తాకకుండా దర్శనం చేసుకోవాలి

విగ్రహాలను తాకకుండా దర్శనం చేసుకోవాలి


ఇక దైవ దర్శనం చేసుకోవడానికి ఆలయాలకు వెళ్లేవారు, ఆలయ ప్రాంగణంలో అంతే ప్రశాంతంగా స్వామిని దర్శించుకోవాలి తప్ప, తమతో వచ్చిన వారిపై, లేదా ఇతరులపై ఆగ్రహాన్ని ప్రదర్శించకూడదని, అలాంటి వారికి భగవంతుని కృప లభించదని చెబుతున్నారు. చాలామంది ఆలయాలలో విగ్రహాలను తాకడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విగ్రహాలను తాకకుండానే దేవుని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు.

చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉండరాదు

చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉండరాదు


విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందని, దైవశక్తికి విఘాతం కలిగిస్తుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఎక్కడైనా ఆలయాలలో దైవ దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహాలను తాకకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు కాకుండా మనసు భగవంతునిపై లగ్నం చేసి ఆలయాలకు వెళ్లినప్పుడు దర్శనం చేసుకొని, కాసేపు ప్రశాంతంగా ఆలయంలో కూర్చొని రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచిస్తున్నారు.

English summary
Those who are going to temple must know the rules of temples according to Vastu Shastra as well as Hindu Dharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X