• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోమూత్రంలో రసాయనిక పదార్దాలు.. ఎలాంటి వ్యాధులు నివారించవచ్చో తెలుసా?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గోమాత అంటే భారతీయ హిందువులకు అత్యంత పవిత్ర గౌరవ స్థానం ఇస్తారు. ఈ గోమాతను నూతన గృహప్రవేశాల సమయంలో మొట్టమొదట పూజ తంతు కార్యక్రమంలో మొదటి పూజ అందుకునేది గోమాతనే, గోమాత నడయాడిన ప్రదేశం అత్యంత పవిత్రంగా మారుతుంది అని మన పురాణాలు తెలుపుతున్నాయి. గోమాత పాలు అత్యంత శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం.ప్రతి శిశువుకు తల్లి పాల తర్వాత తల్లిలా సంపూర్ణమైన ఆరోగ్యానిచ్చేవి ఆవుపాలు. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాత గురించి చెపాలంటే చాలా విశేషమే ఉంది. గోవు మూత్రం మానవాళికి సైన్స్ పరంగా గమనిస్తే ఎంతటి మేలును చేస్తుందో గమనిద్దాం. గోమూత్రంలో రసాయనిక పదార్దాలు వాటి వలన నివారణ అయ్యే వ్యాధులు.

* నత్రజని -

మూత్రము మరియు మూత్ర పిండములను ఉత్తేజిత పరుచును. రక్తము నందలి విష పదార్ధాలను హరించును .

Gomutra in medical treatment

* గంధకము -

రక్తమును శుద్ది పరచును. పెద్ద ప్రేగులు యొక్క పనితనాన్ని మెరుగుపరచును.

* అమ్మోనియా -

ఇది శరీరమునందలి ధాతువులను మరియు రక్తము నందలి పదార్థములను స్థిరంగా ఉంచును.

* అమ్మోనియా గ్యాస్ -

ఊపిరితిత్తులు మరియు ఆయా అవయవములను క్రిముల నుండి రక్షించును.

* తామ్రము -

క్రిమిహరము . ఆయా గ్రంథులను పెరగనీయదు. వాపులను రానీయదు.

* లోహము (ఐరన్ ) -

రక్తము నందలి ఎర్ర రక్త కణములను నిర్మాణం చేయును . పనిచేయు శక్తిని కలిగించును.

* యూరియా -

మూత్రవిసర్జన పైన ప్రభావం చూపించును. క్రిములను హరించును .

* యూరిక్ ఆసిడ్ -

మలమూత్ర సంబంధ దోషాలను మరియు హృదయ సంబంధ దోషాలను హరించును . విషమును బలహీనపరుచును.

* ఫాస్ఫెట్లు -

మూత్ర వ్యవస్థ నందలి ఏర్పడే సన్నటి రాళ్లను బయటకి పంపించడంలో తోడ్పడును .

* సోడియం -

రక్తమును శుద్దిచేయును . ఆమ్ల తత్వమును (antacid ) నివారించును.

* పొటాషియం -

ఆకలిని పుట్టించును . మాంస కండరాల బలహీనతని నివారించును. బద్ధకమును నివారించును.

* మాంగనీసు -

క్రిమి నిరోధము , క్రిమిహరము , శరీరభాగాలు కుళ్లిపోవుట (Gangrene ) నివారించును.

* క్యాల్షియం -

రక్తశోధకం , ఎముకలను బలపరుచును. క్రిములను హరించును . రక్త స్రావాన్ని అరికట్టును.

* లవణము -

దుష్ట వ్రణములు , నాడి వ్రణములు , మధుమేహము , పుట్టుకతో వచ్చు మూర్చ , రక్తములో ఆమ్లతత్వం పెరుగుట నివారించును. క్రిములను హరించును .

* విటమిన్స్ -

A , B , C , D , E విటమిన్స్ శరీరముకు ఉత్సాహము కలిగించును. ఎముకలను దృఢపరచును. ప్రత్యుత్పత్తిశక్తిని పెంచును.

* ఇతర ఖనిజములు -

రోగనిరోధక శక్తిని పెంచును.

* ల్యాక్టోజ్ -

అతి దాహమును తగ్గించును . నోరు ఎండుకుపోవుట , మూత్రము నందు చక్కర పోవుట నివారించును. దప్పిక, గుండెదడ నివారించును. హృదయమునకు మేలు చేయును .

* ఎంజైములు -

శక్తి వర్ధకములు .

* జలము -

జీవశక్తిని పెంచును. రక్తమును ద్రవస్థితిలో ఉంచును. శరీర ఉష్ణమును స్థిరముగా ఉంచును.

* హిఫ్యూరిక్ యాసిడ్ -

మూత్రము ద్వారా విషాలను బహిర్గతం చేయును .

* క్రియాటినిన్ -

క్రిమిహరము .

* స్వర్ణ క్షారము -

క్రిమిహరము . రోగనిరోధక శక్తిని పెంచును. విషాన్ని హరించును .

* ఎనిమిది మాసముల గర్భిణి అయిన గోవు యొక్క మూత్రము నందు హార్మోనులు ఉండును. ఇవి ఆరోగ్యవర్ధకములు. గోమూత్రంను వస్త్ర గలితం చేసి సిద్ధపరచినవి కొన్ని షాపులలో లభిస్తున్నవి.

పైన చెప్పిన ధాతువులు యెక్క ఫలితాలు కేవలం దేశీయ గోజాతి మూత్ర సేవించడం వలన మాత్రమే లభించును. గోమాత యొక్క గొప్పతనం గురించి మరొక్క అద్భుతవిషయం గోవు ఆహారం తీసుకునేప్పుడు మేతలో ఏదైన విషపదార్ధం లోపలికి వెళ్ళినను ఆ విషపదార్ధాన్ని తన మాంసంలోకి గ్రహించును. అంతేగాని మూత్రములోగాని , గోమయములో గాని , లేక పాలలోగాని విసర్జించదు. ఒకవేళ విసర్జించినను అత్యల్పమోతాదులో విసర్జించును. దానివల్ల వాటిని సేవించినవారి ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండదు.

English summary
Gomutram has special place in hindu tradition. It used for medical treatment. helpful in the treatment of leprosy, fever, peptic ulcer, liver ailments, anaemia and cancer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X