ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కలిగిన దేశం ఏదో తెలుసా..?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం సింగపూర్‌ లో ఉంది. ఇక్కడ సగటు డౌన్‌ లోడ్ వేగం 430.31 Mbpsగా నమోదైంది. అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం వల్ల, సింగపూర్ స్థిరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ఇంటర్నెట్ వేగంలో ప్రపంచవ్యాప్తంగా 102వ స్థానంలో ఉంది. ఇక్కడ సగటు డౌన్‌లోడ్ వేగం 61.7 Mbpsగా ఉంది. దేశంలో డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది.

ప్రపంచంలో టాప్ ఇంటర్నెట్ వేగం కలిగిన దేశాలు

ఆధునిక జీవితంలో ఆన్‌లైన్ విద్య, రిమోట్ వర్క్, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి సేవలకు వేగవంతమైన ఇంటర్నెట్ చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న దేశాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.సింగపూర్ కాగా సగటు వేగం 430.31 ఎంబీపీఎస్ గా ఉంది. అలాగే రెండో స్థానంలో

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉంది. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ 375.66 ఎంబీపీఎస్ గా ఉంది. మూడోస్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ 354.04 ఎంబీపీఎస్ గా నమోదైంది. అలాగే నాలుగో స్థానంలో హాంకాంగ్ నిలిచింది. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ 350.73 గా నమోదైంది. ఇక చిలీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. 345.05 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉంది.

Internet Which Country Has the Fastest Internet Speed inthe World Right Now Shocking Truth revealed

ఆ తర్వాతి స్థానంలో ఐస్‌ లాండ్ నిలిచింది. ఈ దేశం ఇంటర్నెట్ స్పీడ్ 343.14 ఎంబీపీఎస్ గా ఉంది. ఇక ఏడో స్థానంలో మకావు ఉంది. మకావులో ఇంటర్నెట్ స్పీడ్ 314.29 గా ఉంది. ఎనిమిదో స్థానంలో అమెరికా నిలిచింది. అమెరికాలో ఇంటర్నెట్ స్పీడ్ 308.63 గా నమోదైంది. ఇక చివరి స్థానాల్లో స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. అయితే ఈ లిస్టులో భారత్ 102 స్థానంలో ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ పరంగా భారత్ ఇంకా భారీ స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+