మాలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు, కమేడియన్ సలీమ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. ఆయనకు భార్య సునీత, చందు, అరోమల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో గుండెపోటుకు గురి కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఆయనను వెంటిలేటర్ ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. తుదిశ్వాస విడిచారు.

సలీమ్ కుమార్ స్వస్థలం పరవూర్. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఈ ఉదయం 9 గంటల నుంచి పరవూర్ టౌన్ హాల్‌లో ఉంచనున్నారు. సాయంత్రం ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కడసారి నివాళులు అర్పించడానికి ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సహా పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు హాజరు కానున్నారు.

Malayalam Cinema Mourns as Renowned actor and mimicry artist Salim Kumar Passes Away at 56

మిమిక్రీ కళాకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సలీం కుమార్ సంపాదించుకున్నారు. కొచ్చిన్ కళాభవన్ వంటి వేదికల ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించి, ఆపై వెండితెరకు పరిచయం అయ్యారు. హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా, భావోద్వేగపూరిత పాత్రలతో కన్నీళ్లు పెట్టించడం ఆయన ప్రత్యేకత.

'ఇష్టమాను నూరువట్టం'తో నటుడిగా పరిచయం అయ్యారు. తమిళ, బెంగాలీ చిత్రాలతో సహా సుమారు 300కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రత్యేకించి మాయావిలో శ్రాంక్, కల్యాణరామన్ లో ప్యారిలాల్ వంటి పాత్రలు నేటికీ సోషల్ మీడియా మీమ్స్‌లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నాయి. వీజీ థంపి దర్శకత్వంలో వచ్చిన 'సత్యమేవ జయతే'లో దొంగ పాత్ర ఆయన కెరీర్‌కు ఒక మలుపుగా నిలిచింది. ఆయన నటనను చూసి రఫీ మెకార్టిన్ ద్వయం తెన్ కాశి పట్టణంలో అవకాశం ఇచ్చారు.

ఆ చిత్రం ఘనవిజయం తర్వాత సలీమ్ కుమార్ కు తిరుగులేకుండా పోయింది. అలాగే 'అచ్చనురంగత వీడు', 'పెరుమజకాలం' వంటి చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. సలీం కుమార్ నటనకు పలు పురస్కారాలు దక్కాయి. 2005లో 'అచ్చనురంగత వీడు'కుగానూ కేరళ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు అందుకున్నారు. 2010లో 'అదామింటే మకన్ అబూ' చిత్రానికి గానూ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు.

2012లో 'అయలుమ్ జనుమ్ తమ్మిల్' చిత్రానికి గానూ ఉత్తమ కమెడియన్ అవార్డు కైవసం చేసుకున్నారు. నటనతో పాటు దర్శకత్వంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2017లో 'కరుత జూథన్' చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర అవార్డు దక్కించుకున్నారు. 2018లో జయరామ్ నటించిన 'దైవమే కైతోజమ్ కె కుమారకణం'కు దర్శకత్వం వహించారు. కళాభవన్ వేదికల నుంచి నేషనల్ అవార్డు స్థాయి వరకు సాగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+