గురువారం..పైగా గురు పౌర్ణమి: నెగ్లెక్ట్ చెయ్యొద్దు- లక్ష్మీ కటాక్షం కోసం..!!

గురు పూర్ణిమ 2025: నేడు గురు పూర్ణిమ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు. నదుల్లో పవిత్రస్నానాలను ఆచరిస్తోన్నారు. భక్తిశ్రద్ధలతో ఆర్ఘ్యాన్ని సమర్పిస్తోన్నారు.

గురు పౌర్ణమి నాడు కొన్ని పనులు చేయడం అశుభంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం దూరమౌతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఆ పనులు చేయడం వల్ల దుష్పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజున ఏయే విషయాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

గురు పూర్ణిమ నాడు గురువులను గౌరవించుకోవడం, కృతజ్ఞతలు తెలుపుకోవడానికే కాకుండా వేదాలను సంకలనం చేసిన రుషి వేదవ్యాసుల జన్మదినంగా కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును "వ్యాస పూర్ణిమ" అని కూడా అంటారు. గురు పూర్ణిమ రోజున ప్రజలు తమ గురువులను శ్రద్ధతో స్మరించుకుంటారు. జప-తపాలు, దానాలు, పూజలు వంటి పుణ్యకార్యాలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

మాంసం, మద్యం దూరం..

ఈ పవిత్రమైన రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక నష్టం వాటిల్లడమే కాకుండా లక్ష్మీదేవి కూడా కోపిస్తుంది. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు లోపిస్తాయి. ఆర్థికంగా కూడా స్థిరత్వం ఉండదు.

గురువును ఆదరించడం వల్ల జీవితంలో జ్ఞానం, సఫలత లభిస్తాయి. గురు పూర్ణిమ రోజున గురువుల పట్ల కృతజ్ఞత చూపించాలి. ఎవరైనా గురువును అవమానిస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే అది చాలా అశుభంగా పరిగణించబడుతుంది. గురువును గౌరవించడం వల్ల జీవితంలో జ్ఞానం, విజయం లభిస్తాయి.

ఈ రోజున కోపం తెచ్చుకోవడం, ఎవరితోనైనా గొడవపడటం లేదా దుర్భాషలాడటం వంటివి చేయకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది. ముఖ్యంగా మహిళలతో దురుసుగా ప్రవర్తించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీనికి విరుద్ధంగా మీరు మహిళలను గౌరవిస్తే, బహుమతులు ఇస్తే ధన, సౌభాగ్యాలు లభిస్తాయి.

గురు పూర్ణిమ రోజున శాంతంగా ఉండాలి. ఈ రోజు కోపం తెచ్చుకోవడం, గొడవలు పడటం, చెడు మాటలు మాట్లాడటం వంటివి ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లు అవుతుంది. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు. మహిళలను గౌరవించి, వారికి బహుమతులు ఇవ్వడం వల్ల ధన, సౌభాగ్యాలు కలుగుతాయి.

గురు పూర్ణిమ ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున గురువును పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. గురు ఆశీస్సులుంటే జీవితంలో వెలుగు నిండుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+