కర్కాటక, తుల, కుంభ, మేష రాశులకు నవంబర్ 1 నుంచి 'మహాలక్ష్మి రాజయోగం'
పండగ వేళ గ్రహాల సంచారంతో ఆకాశంలో అరుదైన ఖగోళ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈసారి నవంబర్ 1వ తేదీన కుజ, చంద్రుల అరుదైన కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన 'మహాలక్ష్మి రాజయోగం' ఏర్పడనుంది. అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి వేళ చంద్రుడు తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
నవంబర్ 1న కూడా చంద్రుడు ఇదే రాశిలో కొనసాగుతూ, అక్కడ ఉన్న కుజుడితో జతకట్టడం వల్ల ఈ రాజయోగానికి బీజం పడుతోంది. ఈ అరుదైన యోగ ప్రభావంతో నవంబర్ నెల ప్రారంభం నుంచే ప్రధానంగా 4 రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. దీర్ఘకాలిక సమస్యలు తీరడమే కాకుండా, ఊహించని ధనలాభాలు లభించనున్నాయి.

కర్కాటక రాశి
తన సొంత రాశిలోనే ఈ యోగం ఏర్పడుతుండటంతో కర్కాటక రాశి వారికి నవంబర్ నెల బంగారు భవిష్యత్తును ఇవ్వబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాబడి మార్గాలు పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారి కష్టానికి తగిన గుర్తింపు, ప్రమోషన్లు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
తులా రాశి
తులా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం విశేషమైన ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరి లాభాల బాట పడతారు. రాబడికి తగ్గట్టుగానే ఖర్చులు అదుపులో ఉండటంతో ఆర్థికంగా బలపడతారు.
కుంభ రాశి
ఈ రాజయోగ ఎఫెక్ట్‌తో కుంభ రాశి వారికి అడుగడుగునా బంపర్ ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పాత ప్రాజెక్టులు ఊపందుకోవడంతో పాటు కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయి. హఠాత్తుగా చేతికి అందే ధనలాభాలు వీరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
మేష రాశి
మేష రాశి వారికి కాలం అన్ని విధాలా అనుకూలించబోతోంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురవుతున్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా రాబడులు వస్తాయి. ఊహించని ధనలాభం కలగడంతో పాటు కుటుంబంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు సమసిపోయి ప్రశాంతత లభిస్తుంది.














Click it and Unblock the Notifications
