ఏ పూజ ఎలా చేయాలి ?

ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గానీ, విష్ణుపూజను గానీ ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లయి - వైకుంఠాన్ని పొంది తీరుతారు.

హైదరాబాద్:

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే | '

ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికినీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగును గాక" అని క్షమాపణ కోరుకోవాలి. ఆ ఆతర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి, పునః క్షమాపణలు చెప్పకుని, నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి.

ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గానీ, విష్ణుపూజను గానీ ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లయి - వైకుంఠాన్ని పొంది తీరుతారు.

ఆర్ద్యమంత్రం శ్లో|| నమః కమలనాభాయ నమస్తే జలశాయినే
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తతే |

స్నానవిధి ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి - బొడ్డులోతు వరకకు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరికపప్ప, నువ్వుల చూర్ణంతోనూ - యతులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి.

విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య - ఈ ఆరు తిధులలోనూ - నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీరశుద్ధికి స్నానం చేసి, ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణలోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి.

భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక! విష్ణ్వాజ్ఞపరులైన ఇంద్రాది సమస్త దేవతలును నన్ను పవిత్రుని చేయుదురు గాక రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ట కశ్యపాది మునివరిష్టుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక, గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, ప్రూదాలు నన్ను పవిత్రుని చేయుగాక.

how to worship god?

ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ, గరుడాదులు - ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక" ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి - చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ-ఋషి-పితృ-తర్పణాలను విధిగా చేయాలి.

కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి, ప్రాతఃకాలానుష్టానం (సంధ్యావందనాది) నెరవేర్చుకొని - విష్ణు పూజను చేయాలి.

ఆర్ద్యమంత్రం శ్లో||ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధానామము

గృహాణార్థ్యం మయాదత్తంరాధయా సహితోహ రే |
అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్థ్యాన్ని, క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటపుడు -

తీర్ధాని దక్షిణే పాదే వేదాస్త్ర న్ముఖమాత్రితాః
సర్వావంగేష్వాబ్రితాః దేవ్యా పూజితోసిమదర్బయా

కుడి పాదమందు సర్వతీర్ధములు, చతుర్వేదములు, అవయవము లందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరి ప్రియమైన తులసికి ప్రదక్షిణ మాచరించి - 'దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు (పేయసివగు ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక" అనుకొని - నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరకలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి.

సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్దీదాయకమూ, పుత్రపౌత్ర ధనప్రదమూ, ముక్తికారకమూ, విష్ణుప్రీతికరమూ ఐన కార్తీక వ్రతాన్ని మించింది, కలియుగంలో మరొకటి లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+