విలువలకు నిదర్శనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..సొంత డబ్బులతోనే సర్జరీ!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూటే సపరేటు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, అధికారికంగా తనకు వ్యక్తిగతంగా వచ్చే వాటిని ప్రజా సంక్షేమం కోసం వినియోగించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. తాను నమ్మిన సూత్రాలకు కట్టుబడి జీవించే గొప్ప గుణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది.
శస్త్ర చికిత్సకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు
ఎప్పుడు ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదని నమ్మిన ఆయన దానికి కట్టుబడి తన ఖర్చులను తన సొంత డబ్బుల నుండి మాత్రమే భరిస్తారు. ఇటీవల ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న క్రమంలో, చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వ నిధి నుండి తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే భరించారు పవన్ కళ్యాణ్.

ప్రజా ధనాన్ని సొంత ఖర్చుల కోసం వాడుకోకూడదన్న పవన్ కళ్యాణ్
మంత్రులుగా కొనసాగే వారికి వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది. ప్రభుత్వం ఖర్చులు భరించే సదుపాయం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ప్రజాధనాన్ని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోకూడదు అని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ గతంలో ముక్కు సర్జరీ చేయించుకున్న సమయంలో కూడా తన సొంత డబ్బులతోనే సర్జరీ చేయించుకున్నారు.
విలువలకు నిదర్శనం పవన్ కళ్యాణ్
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి సర్జరీ కోసం తన సొంత డబ్బే ఖర్చు పెట్టారు. ఇది ఆయన నిబద్దతకు తార్కాణం. ఆయన విలువలకు నిదర్శనం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలా బెన్ దీరూభాయ్ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారిక కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సొంతలాభం కొంత మానుకుంటే బెస్ట్
అయితే ప్రభుత్వం నుండి వచ్చింది ఏదైనా అప్పనంగా వాడుకునే మంత్రులు, అధికారులు ఉన్న నేటి రోజుల్లో పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులను తాను సంపాదించిన డబ్బుల నుండే ఖర్చు పెట్టుకోవటం రాష్ట్రంలోని అందరికీ ఆదర్శం . ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, మంత్రులు పవన్ కళ్యాణ్ తరహాలో సొంత లాభం కొంత మానుకుంటే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రజలపై ఆర్ధిక భారం తగ్గుతుంది.












Click it and Unblock the Notifications