• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ మూడూ లేకపోతే దుఃఖం: మనిషికి కావలసినది ఏమిటి?

|

లోకంలో ధనంలేక కొంతమంది ఆరోగ్యం సరిగాలేక కొంతమంది చుట్టూ ఉండే వ్యక్తుల సహకారంలేక కొంతమంది బాధపడుతుంటారు. కానీ ఆ మూడు ఉన్నపుడు కూడా వ్యక్తికి ఆనందాన్ని కలిగించవు. అనారోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది తప్ప ఆరోగ్యంగా ఉన్నపుడు అది ఆనందాన్నివ్వదు. అలాగే ధనం లేనపుడు లోటు తెలుస్తుంది తప్ప ఉన్నపుడు ఆనందాన్నివ్వదు. అలాగే ఇతరుల నుంచి సహకారం వచ్చినపుడు అది సహజంగా కనిపిస్తుంది. అది లోపించినపుడు బాధాకరంగా ఉంటుంది. ఈ ఆరోగ్యము, ధనము, సహకారము లేనపుడు ఇబ్బందిని కలుగజేస్తున్నాయి ఉన్నపుడు ఆనందాన్ని ఇవ్వటంలేదు.

కొన్ని ఉండి బాధపెడతాయి. అవి సంకల్పం, అహంకారం, మమకారం, తన సంకల్పాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొందరైనా ఉంటారు కాబట్టి వారినుంచి వ్యతిరేకత వస్తుంది. తద్వారా మనస్సుకి ఘర్షణ ఏర్పడుతుంది. అహంకారము తనయొక్క వస్తు స్వరూపమైన పరమాత్మ తత్వం అనంతశక్తి సంపన్నం. కాని మనస్సుకి శరీరానికి గల పరిమిత శక్తులను ఆధారంచేసుకుని వాటి కంటే కొంత ఎక్కువ తీసుకుని వాటిని తనయందు (చైతన్యమునందు ) ఆరోపించి వ్యక్తి అహంకారాన్ని పొందుతున్నాడు.

If the ultimate aim is moksha, why people earning in wrong way?

మొదటి మూడూ లేకపోతే దుఃఖాన్నిస్తున్నాయి ఉంటే ఆనందాన్నివ్వడం లేదు. మరి ఆనదాన్నిచ్చేదేమి? 'మోక్ష లక్ష్యం' వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. లోకంలోని సమస్యలన్నీ మోక్షం స్థానంలో చిన్నవే. అంటే మోక్షాన్ని సాధించటము అనే పెద్దలక్ష్యం ఉన్నప్పుడు తక్కిన సమస్యలు సాధించినా సాధించకపోయినా పెద్ద సమస్యాత్మకంగా ఉండదు, మనస్సుకి ఇబ్బంది కలగదు.

ఈ లక్ష్యం అనే నిర్దేశం లేనపుడు వ్యక్తి చుట్టూగల సమస్యలనే పెద్ద సమస్యలుగా భావిస్తూంటాడు. దుఃఖాత్ముడవుతాడు. మోక్షమే లక్ష్యంగా పెట్టుకుంటే తక్కిన అంశాలు బాధించవు. ఈ 'సమస్య' అని దేనిని అంటున్నామో 'ఆ సమస్య పరిష్కరించబడితే ఆ తరువాత ఏమి?' అని ప్రశ్నించుకున్నపుడు ఈ 'సమస్య' బాధాకరము కాదు.

వ్యక్తిగత జాతకంలో ద్వాదశ ( భావ ) రాశి స్థానాలలో ఉన్న ఈ క్రింది గ్రహాల ఆధారంగా అయా ఫలితాలు ఏర్పడతాయి

సూర్యుడు మమకారానికి సంబంధించినవాడు.

చంద్రుడు సంకల్పానికి సంబంధించినవాడు.

కుజుడు అహంకారానికి సంబంధించినవాడు.

బుధుడు ధనానికి సంబంధించినవాడు.

గురుడు మోక్షలక్ష్యానికి సంబంధించినవాడు.

శుక్రుడు జన సహకారానికి సంబంధించినవాడు.

శని ఆరోగ్యానికి సంబంధించినవాడు.

ఏఏ భావాలలో లోపముందో ఆయా విషయాలలో ఇబ్బంది కలుగుతుంది. ఈ లోపాలను సవరించు కోవడానికి ప్రయత్నం చేయాలి. సహకారంలో లోపమున్నపుడు 'సర్వేజనా:స్సుఖినోభవంతు' అనే ధ్యానము, ధన విషయంలో లోపమున్నప్పుడు 'దాన' ధ్యానము, ఆరోగ్య విషయంలో లోపమున్నపుడు 'ఆరోగ్య' ధ్యానము సంకల్ప విషయంలో దోషమున్నపుడు 'జ్ఞానదాన' ధ్యానము, అహంకార విషయంలో బాధాకరంగా ఉన్నప్పుడు 'ఏకాత్మభావన' ధ్యానము మమకార విషయంలో లోపమున్నపుడు 'సద్యోముక్తి' ధ్యానము వ్యక్తికి బాగా ఉపకరిస్తాయి.తద్వార ఆయా లోపాలను పూరిస్తాయి.

అహంకారం 'ఎదుటి వాడికంటే నేనెక్కువ' అనే భావన కదా. ఏకాత్మ భావనచేస్తే ఎక్కువ తక్కువలుండవు. అలాగే సంకల్పలో లోపం ఎందుకు వస్తుంది ? 'జ్ఞానం' లోపించినందువలన. అంటే ఏ పని చేస్తే ఏమిటో తెలియనందు వలన జ్ఞానాన్ని దానం చేసిన భావన చేసినట్లైతే సరైన సంకల్పమే కలుగుతుంది. లేదా సంకల్పము యొక్క అవసరం లేదని తెలుస్తుంది. మమకార విషయంలో అనుకొన్నది మరోలా జరుగుతుంది అనే భావన కలిగినపుడే బాధను కలిగిస్తుంది.

నాది అనుకున్నది నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినపుడు మమకారం బాధిస్తుంది. ఎప్పుడైతే 'సద్యోముక్తి' అనే భావన కలుగుతుందో సర్వ భూతములను పాలించే జగన్మాత తల్లీ అనే భావన వల్ల 'ఏది జరిగినా అది మన మంచి కోసమే' అనే భావాన్ని గుర్తించడం వల్ల మమకారం బాధించదు. ఉండి బాధించేవి మూడు, లేక బాధించేవి మూడు. మొత్తం ఈ ఆరు రకాల ధ్యానాల వలన విముక్తిని పొందితే 'మోక్షసంకల్పం' వల్ల మోక్షాన్ని సాధించ గలుగుతారు. ఆనందాన్నిచ్చేది 'మోక్షలక్ష్యం' తప్ప మిగిలిన ఆరు కావు.

అన్ని పనులు మోక్షం కోసమే చేయాలి. మోక్షం కోసం బతకాలి, బతకడం కోసం తినాలి. తినడానికి ధర్మబద్దంగా సంపాదించాలి. అంటే సంపాదించడం కూడా పరోక్షంగా మోక్షం కోసమే అయినపుడు మోక్షసాధనకు వ్యతిరేక దిశలో పాపమార్గంలో సంపాదన చేయరాదు. ఆనందం కావాలి అది ఒక్క మోక్షమే. తక్కినవన్నీ దానికి సాధనాలేగాని జీవితలక్ష్యాలుకావు.

--- డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Moksha can be attained by higher knowledge when a person gains the truth that he is almighty himself and lives in the body to experience Prarabdha karma and attain Salvation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more