వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాలుంటే జ్యోతిష్యుడి దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు.. ఇలా చేయండి!!

|
Google Oneindia TeluguNews

ప్రతి మనిషి తనకు తానే కష్టాలను కోరి తెచ్చుకుంటాడు. భగవంతుడు వాటిని ప్రత్యేకంగా సృష్టించి ఫలానా సమయంలో ఫలానా వారికి ఈ కష్టాలు రావాలి.. అని చెప్పి రాతను రాయలేదు. మొదటగా మనం చేసే పనుల ఫలితాన్ని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక పని చేశామంటే భవిష్యత్తులో దానికి సంబంధించిన ఫలితం కష్టంగా ఉండొచ్చు.. లేదంటే సుఖంగా ఉండొచ్చు. సుఖంగా ఉన్నప్పుడు స్వీకరించడానికి లేని ఇబ్బంది కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు స్వీకరించలేకపోతున్నామని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం దొరక్కపోతే గురువును ఆశ్రయించాలి.

పరిగెత్తాల్సిన అవసరమే లేదు..

పరిగెత్తాల్సిన అవసరమే లేదు..

కష్టంగా ఉంది.. భరించలేనిదిగా ఉంది ప్రస్తుత పరిస్థితి అంటూ జ్యోతిష్యుల దగ్గరకు పరిగెడుతూ ఉంటారు. వాస్తవానికి జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడూ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధంచి రాయలేదు. అది ఒక సమూహానికి సంబంధించి, ఖగోళానికి సంబంధించిన శాస్త్రం. కాలక్రమేణా అది వ్యాపారమై ప్రజలను భయపెట్టేస్థాయికి చేరుకుంది. ఉగాది పర్వదినం సమయంలో పంచాంగ శ్రవణం చేస్తారు.. ఆ సంవత్సరం మొత్తం వర్షాలు ఎలా పడతాయి? ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? రాజ్యంలో రాజు ఎలా ఉంటారు? వాతావరణం ఎలా ఉండబోతోంది? రైతులకు ఏ విధంగా లాభనష్టాలు కలుగుతాయి? అంటూ పండితులు విడమరిచి చెబుతుంటారు.

మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి..

మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి..

మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పంచాంగ శ్రవణంలో ఎక్కడా ఒక వ్యక్తికి సంబంధించిన ధోరణే ఉండదు. సమూహానికి సంబంధించినదే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం అనేది సమూహానికి సంబంధించినది అని అర్థం చేసుకుంటే చాలు. మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకుంటే శివాలయానికి వెళ్లి.. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. పూజా సామాగ్రి ఖర్చు రూ.2వేల లోపే అవుతుంది.

మనసు విప్పి మాట్లాడండి..

మనసు విప్పి మాట్లాడండి..


మీ కష్టం చెప్పుకోండి.. మనసు విప్పి ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడండి.. పరిష్కారం చూపించమని అడగండి.. కష్టాలొచ్చినప్పుడు మాత్రమే వీడికి నేను గుర్తుకొస్తాను అని ఆయన అనుకోడు. అనుకుంటే ఆయన కూడా మనలాంటి మానవుడే అవుతాడు. వెంటనే పరిష్కారం చూపిస్తాడు. జ్యోతిష్యుడిని కలవడానికి వందల రూపాయలు, అతను చెప్పిన పరిహారానికి వేలకు వేలరూపాయలు ఫీజులుగా చెల్లించాల్సిన అవసరం లేదు. మానసికంగా మీరు ధృఢంగా ఉంటే చాలు.

English summary
Every man brings trouble to himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X