సూర్య, బుధ సంచార ప్రభావం.. ఈ రాశులకు ధనయోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థాన చలనం చాలా ముఖ్యమైనది. అన్ని రాశులలోకి నవగ్రహాలు వివిధ సందర్భాలలో సమయానుకూలంగా సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తాయి. మార్చి 14, 15వ తేదీలలో రెండు గ్రహాలు తమ మార్గాలను మార్చుకుని సంచారం చేస్తున్నాయి.
సూర్యుడు, బుధుడు సంచారం
సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించి సంచారాన్ని ప్రారంభిస్తే, బుధుడు మార్చి 15వ తేదీ నుండి తిరోగమనాన్ని ప్రారంభించాడు.సూర్యుడు, బుధుని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
సూర్యుడు మరియు బుధుని మార్పు వల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఏ పని చేసినా కూడా సానుకూలంగా పూర్తవుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ బాకీలు వసూలవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జీవితంలో అన్ని సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. మీ నిజాయితీకి, కృషికి విజయం లభిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడు, బుధుడు మార్పు మంచి అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న సింహ రాశి వారు అన్నింటిలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో సింహ రాశి వారి సామాజిక గౌరవం పెరుగుతుంది. అప్పుల బాధ తొలగుతుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారు వృద్ధిని పొందుతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి వారికి సూర్యుడు, బుధుడు మార్పు ప్రయోజనదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల పైన ఆసక్తి పెరుగుతుంది. తులారాశి జాతకులు పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications