2025 ఏప్రిల్ నెల వరకు ఈ రాశులవారు తగ్గేదేలే... గర్వంగా చెప్పిన గురువు!

జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని అత్యంత సానుకూలమైన గ్రహంగా భావిస్తారు. బృహస్పతి సంచారం అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. నవంబర్ 28వ తేదీన బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకొని రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించారు.

ఏప్రిల్ వరకు బృహస్పతి కటాక్షం
ఇది చంద్రుడి నక్షత్రం కావడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి 2025 ఏప్రిల్ 10వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీని ఫలితంగా మూడు రాశుల వారికి ఏప్రిల్ 10వ తేదీ వరకు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Jupiter has announced lucky zodiac signs that will get huge wealth till april 2025

వృషభరాశి
గురు భగవానుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఏ పనులు చేపట్టిన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరికి అదృష్టం అండగా నిలుస్తుంది. ఈ సమయంలో వీరు వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. నూతన ఆదాయవనరులు కనిపిస్తాయి. ఇది వృషభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే సమయం.

కర్కాటక రాశి
రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరించడం వల్ల కర్కాటకరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలతో ఈ సమయంలో ఏ పని చేసిన మంచి గుర్తింపు వస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

సింహరాశి
బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగం చేసే వారికి వ్యాపారం చేసే వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. పనిచేసే చోటా పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇది సింహ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టాన్ని ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+