మాఘ నక్షత్రంలో కేతువు..ఈ రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది
జ్యోతిష్య శాస్త్రంలో కేతువును నీడ గ్రహం అని, మోక్ష కారకుడని పిలుస్తారు. సాధారణంగా కేతువు పేరు చెబితే భయపడేవారు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక నక్షత్ర సంచారాలు మాత్రం అద్భుతమైన యోగాలను కలిగిస్తాయి. తాజాగా 2026లో కేతువు మాఘ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువుకు ఇష్టమైన ఈ నక్షత్ర సంచారం కారణంగా ఒక శక్తివంతమైన మహారాజ యోగం ఏర్పడబోతోంది.ముఖ్యంగా 2026 మే 31 నుండి ఆగస్టు 2 వరకు ఈ యోగం ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. ఈ రెండు నెలల కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం బంకలా పట్టుకుంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్కీ రాశులు ఎవరో చూద్దాం.
1. మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ కాలం స్వర్ణయుగం అనే చెప్పాలి. కేతువు అనుగ్రహంతో వీరి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెంపు ఖాయం.కొత్త ఇల్లు లేదా విలాసవంతమైన కారు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

2. వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతు సంచారం ఆర్థికంగా కొత్త ద్వారాలు తెరుస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ధనం చేకూరుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
3. కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రాజయోగం అశేష లాభాలను తెచ్చిపెడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు రెట్టింపు లాభాలు అందుతాయి.వృత్తిపరంగా అంచలంచెలుగా ఎదుగుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి.
కేతువు ఇచ్చే ఈ మహారాజ యోగం ఈ మూడు రాశుల వారిని ఆర్థికంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టబోతోంది. కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ వంతు.












Click it and Unblock the Notifications