శ్రావణ మాసంలో ఇలా చేయండి.. దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి
హిందూ సంప్రదాయంలో పరమ శివుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ భోళా శంకరుణ్ని పూజిస్తే అన్ని దు:ఖాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. జాతకంలో రాహువు, కేతువుతో దోషాలు ఎదుర్కొంటుంటే శ్రావణ మాసంలో శివుడిని పూజించడంతోపాటు ధ్యానం, జపం చేస్తే ఆయన అనుగ్రహం సొంతమవుతుంది. శ్రావణ శివరాత్రి రోజు కొన్ని చర్యలు తీసుకోవడంద్వారా రెప్పపాటులో దోషాలన్నీ పోతాయి. శివుడు రాహువు, కేతువుతోపాటు శని గ్రహానికి కూడా అధిపతి.
* జ్యోతిష్యం ప్రకారం జాతకంలో రాహు-కేతు దోషాలు పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. నివారణ కోసం శ్రావణ మాసం శివరాత్రి రోజు నీటిలో మామిడి ఆకులు, దర్భగడ్డిని కలిపి శివునికి అభిషేకం చేయాలి.
* నియమ నిబంధనల ప్రకారం శివరాత్రి రోజు శివయ్యను పూజించడంతోపాటు శివ పురాణం చదవాలి.
* శ్రావణమాసంలోని శివరాత్రి రోజు రుద్రాక్ష జపమాలతో 'ఓం నమః శివాయ' లేదా మహాదేవుని మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం చేస్తే మీరు కాలసర్ప దోషం నుండి విముక్తి పొందుతారు.

* శివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెను సమర్పించాలి. పవిత్ర గంగానది జలంతో చేసే అభిషేకంతో రాహువు వల్ల ఏర్పడిన ఇక్కట్లు వెంటనే తొలగిపోతాయి.
* జాతకంలో రాహువుకు సంబంధించిన దోషంతోపాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. శివలింగానికి గంగాజలం సమర్పించాలి. అనంతరం 21 తెల్లని రంగు పువ్వులను శివ మంత్రాన్ని జపిస్తూ సమర్పించాలి.
* శ్రావణ మాసం శివరాత్రికి పూజ చేసే సమయంలో నిర్మలమైన హృదయంతో శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. దీనివల్ల కూడా రాహు-కేతు దోషం తొలగిపోతుంది.












Click it and Unblock the Notifications