ఆగస్టు 26వ తేదీలోపు ఈ రాశులవారు కోటీశ్వరులవుతున్నారు
నవ గ్రహాల్లో శుభాలను ఇచ్చే కుజుడు, దేవ గురువైన బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తుండటాన్ని అరుదైన పరిణామంగా భావిస్తారు. వచ్చేనెల 26వ తేదీ తర్వాత కుజుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకేరాశిలో ఉండటంవల్ల రాజయోగం ఏర్పడింది. సంపద, పిల్లలు, భక్తి, ధ్యానం, నైతికత, ఆధ్యాత్మికతకు కారణమైన గురుడు, నాయకత్వ లక్షణాలనిచ్చే కుజుడివల్ల మూడు రాశులవారికి విపరీత ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారి వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెళ్లి కానివారికి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం, అన్యోన్యత పెరుగుతుంది. వారి నుంచి లభించే మద్దతుతో అన్ని పనుల్లోను విజయం సాధిస్తారు.

సింహ రాశి
వ్యాపారస్తులు మంచి విజయాలను అందుకుంటారు. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు కొన్నింటిలో పెట్టుబడి పెడతారు. ఇవి దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఇవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి. వాహనంతోపాటు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. తోబుట్టువుల నుంచి శుభవార్తను అందుకుంటారు.
తులా రాశి
గురుడు, కుజుడి కలయికవల్ల మనసు సంతోషంగా మారుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి భారీ లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట గొప్ప విజయం లభిస్తుంది. సంపాదించే డబ్బును పొదుపు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొని కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వివాదాస్పదంగా ఉన్న కేసులు పరిష్కారమవడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకుంటారు.












Click it and Unblock the Notifications