త్వరలో వీరే కుబేరులు.. మాట తప్పను, మడమ తిప్పనన్న కుజుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి తనదైన స్థానం ఉంటుంది. అలాగే కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజుడు ప్రస్తుతం తిరోగమనంలో సంచరిస్తున్నాడు. 80 రోజుల తర్వాత కుజుడు ప్రత్యక్ష సంచారం చేయబోతున్నాడు. మిధున రాశిలో ప్రస్తుతం కుజుడు తిరోగమనంలో ఉన్నాడు.
కుజుడి ప్రత్యక్ష సంచారం
2025 ఫిబ్రవరి 24వ తేదీన కుజుడు తన గమనాన్ని మార్చుకొని ప్రత్యక్ష సంచారం చేయబోతున్నాడు. కుజుడి ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కుజుడి కారణంగా అనేక ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. కుజుడు ప్రత్యక్ష సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
కుజుడు ప్రత్యక్ష సంచారం మిధున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశి వారి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. మిధున రాశి వారికి అన్నింట విజయం లభిస్తుంది.
సింహరాశి
కుజుడు ప్రత్యక్ష సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భూములు, నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంతో సింహ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభిస్తాయి ఇది సింహరాశి వారికి సకల శుభాలను చేకూర్చే సమయం.
తులారాశి
కుజుడి ప్రత్యక్ష సంచారం తులా రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులకు ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి రోజులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి విజయం వరిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. తులా రాశి జాతకులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది .ఈ సమయంలో తులా రాశి వారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications